శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి, నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి నీయందమున్నెంచి నీదాసదాసుండనై, రామభక్తుండనై, నిన్ను నేగొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకన్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిల్చితే, తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై, స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి, వాలినిన్ జంపించి కాకుత్థ్స స్వామిన్ దయాదృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్,లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, నాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి, సంతోషమున్ గూర్చి, సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి, వానరుల్‍మూకలై పెన్మూకలై, యాదైత్యులన్ ద్రుంచగా, నా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై, కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి, యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవినిన్‍దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించియున్, కుంభకర్ణాదులన్, వీరులన్ బోరి, శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండ నవ్వేళలోనన్ విభీషణాఖ్యున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముతోజేర్చి, అయోధ్యకున్ వచ్ఛి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ కీర్తనల్ చేసినన్ పాపముల్ బాయవే? క్లేశముల్ దీరవే? భాగ్యముల్ గల్గునే? సామ్రాజ్యముల్ సర్వసంపద్విశేషంబులున్ గల్గునే? వానరాకార! ఓ భక్తమందార! ఓపుణ్యసంచార! ఓధీర! ఓశూర! నీవే సమస్తంబునన్ వజ్రదేహంబునన్ దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ జిహ్వయందుండినన్ దీర్ఘదేహాన త్రైలోక్యసంచారివై, రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మతేజంబునన్ బుట్టి, దేవా! హనూమంత! ఓంకారశబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్ భూతబేతాళ సంఘాదిపైశాచులన్, శాకినీ, ఢాకినీ, మోహినీత్యాది దయ్యంబులన్, రోమఖండంబులంద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్యతేజంబునున్ జూపితే, నాప్రేమపున్నరసింహా! యటంచున్ దయాదృష్టి వీక్షించి, నన్నేలు నాస్వామి నాథా! నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తి హారి! నమో వాయుపుత్రా! నమస్తే నమస్తే నమః
Thursday, November 22, 2012
ఆంజనేయ దండకం

Labels:
శ్లోకాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment