Showing posts with label జ్యోతిష్యం. Show all posts
Showing posts with label జ్యోతిష్యం. Show all posts

Friday, August 29, 2014

కుజదోష ఫలములు

కుజదోష ఫలములు

కుటుంబేచ వ్యయే సౌఖ్యే । సప్తమే చాష్టమే కుజే ।
నరాణాం స్త్రీ వధం కుర్యాత్ । స్త్రీణాం భర్తృవధం తథా ॥
2,12,4,7,8 ఈ రాశులందు కుజుడున్నచో పురుషులకు భార్యా వియోగము, స్త్రీలకు భర్తృ వియోగము గలదు. 

"కించ" అర్కేందు క్షేత్రజాతానాం కుజదోషో న విద్యతే ।
అర్కుడనగా సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు. సూర్యుని రాశి సింహము. చంద్రుని రాశి కర్కాటకము. సింహ కర్కాటక రాశి జాతకులకు కుజదోషం రాదు.

"కించ" స్వౌచ్చ మిత్ర భ జాతానాం పీడకో న భవఎత్కుజః ।
అంగారకునికి స్వక్షేత్రములగు మేష వృశ్చిక రాశులలోను ఉచ్ఛ అయిన మకరము నందు, కుజునికి మిత్రులగు గురు, రవి రాశులైన ధనుః , మీన, సింహ రాశులలో జన్మించు వారికి కుజదోషం లేదు.

కించ దేవకేరళే ॥ ద్వితీయే భౌమదోషస్తు యుగ్మకన్యకయోర్వినా । 
మిధున, కన్య రాశులందు పుట్టిన వారికి రెండవ యింటయందున్న కుజదోషము లేదు.

ద్వాదశే భౌమదోషస్తు వృషతౌళిక యోర్వినా ।
తుల, వృషభ రాశులందు పుట్టినవారికి పండ్రెండింటనున్న కుజదోషము లేదు.

చతుర్థే భౌమదోషస్తు మేష వృశ్చిక యోర్వినా ।
మేష, వృశ్చిక రాశులందు పుట్టినవారికి నాల్గవయింటవున్న  కుజదోషము లేదు.

సప్తమే భౌమదోషస్తు నక్ర కర్కట యోర్వినా ।
మకరము, కర్కాటకములందు జన్మించు వారికి సప్తమ స్థానమందున్న కుజదోషము లేదు.

అష్టమే భౌమదోషస్తు ధనుర్మీన ద్వయోర్వినా ।
ధనూరాశి, మీనా రాశి జాతకులకు అష్టమ స్థానమునందున్న కుజదోషము లేదు.

కుంభే, సింహే నదోష స్స్యాత్ ।

కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోష ప్రసక్తి లేదు.

గురు మంగళ సంయోగే భౌమదోషే న విద్యతే ।
కుజుడు, గురువుతో కలసియున్ననూ, గురుదృష్టి కుజుని పైనున్ననూ ఆ జాతకులకు కుజదోషము లేదు.

ద్విరతీయే ద్యూన గే పుంసాం స్త్రీణాం  చత్వారి రి వృగే ।
పురుషులకు సప్తమ, ద్వితీయ స్థానాల్లో కుజుడు మిక్కిలి దోషకారి. స్త్రీలకు చతుర్థ, అష్టమ స్థానములో ఉన్న కుజుడు మిక్కిలి అపాయకారి. 

ఉభయోరష్టమం రోషం భౌమదోషం వదెద్బుధః ।
స్త్రీపురుషులకు అష్టమ స్థానంలో చాలా ప్రమాదకారి.

దంపత్యోర్జన్మకాలే వ్యయ ధన హి ఋతే సప్తమే రంధ్ర లగ్నే ।
లగ్నా చంద్రాచ్చ శుక్రాదపి ఖలు నివసన్ భూమి పుత్రా స్తయోశ్చ ॥

భార్యాభర్తల జన్మ రాశికి ద్వాదశ, ద్వితీయ, చతుర్థ, అష్టమ లగ్నములలో ఎక్కడ కుజుడున్ననూ దోషకారి. ఈ దోషము జన్మలగ్నమునుండి గాని, చంద్రుడున్న రాశినుండి గాని, శుక్రుడున్న రాశినుండి గాని, కుజదోషమును చూచుకోవలయును. దంపతులకు జన్మరాశి, చంద్రరాశి, శుక్రరాశుల నుండి ఎక్కడ కుజదోషమున్ననూ అది పరిహార శక్యము.

దాంపత్యం దీర్ఘకాలం నుత ధనబహుళం పుత్రలాభం చ సౌఖ్యం ।
దద్యాదేకత్ర హీనో మృతిరఖిలభయం పుత్రనాశం కరోతి ॥

పైన చెప్పిన రీతిలో నున్న కుజదోషము పరిహారమైనచో దంపతులకు సుఖదాంపత్యం, సంతానం, ధనవృద్ధి, సౌఖ్యం సిద్దించును. ఇరువురిలొ ఏ ఒక్కరికి కుజదోషమున్ననూ మరణము, భయము, గర్భశోకము కలుగును.

Thursday, August 28, 2014

రాహుకాల, యమగండ, దుర్ముహూర్తములు

రాహుకాల, యమగండ, దుర్ముహూర్తములు


పైన చూపిన రాహుకాల, యమగండ, దుర్ముహూర్తములు ప్రతివారము స్పృశించును. ప్రతి దుర్ముహూర్త కాలం రెండు ఘడియలు మాత్రము సర్వ శుభకార్యములందు త్యజింపదగినది.

Friday, April 19, 2013

రాశ్యాధిపతులు

రాశ్యాధిపతులు అనగా  రాశులకు అధిపతులు

12 - రాశులు
మేషం
వృషభం
మిథునం
కర్కాటకం
సింహం   
కన్య
తుల
వృశ్చికం
ధనుస్సు
మకరం
కుంభం
మీనం

9 - గ్రహాలు
రవి
చంద్రుడు 
కుజుడు
బుధుడు 
గురుడు
శుక్రుడు
శని
రాహువు
కేతువు

శ్లోకము:
సింహస్యాధిపతి సూర్యః | కర్కటస్య నిశాకరః |
మేషవృశ్చికయోర్భౌమః | కన్యామిథునయోర్బుధః |
ధనుర్మీనద్వయోర్మంత్రీ | తులావృషభోయోర్భృగుః |
మకరస్యచ కుంభౌచ నాయక స్సూర్యనందనః ||

 

తాత్పర్యము:
సూర్యుడు సింహరాశికధిపతి | చంద్రుడు కర్కాటకరాశికధిపతి | కుజుడు మేష వృశ్చిక రాశులకధిపతి | బుధుడు కన్యా మిథున రాసులకధిపతి | గురువు ధనుర్మీన రాసులకధిపతి | శుక్రుదు తులా వృషభ రాసులకధిపతి | శని మకర కుంభరాసులకధిపతి ||

Friday, December 21, 2012

కాల మానము


60 విలిప్తలు - 1 లిప్త
60 లిప్తలు - 1 విఘడియ
60 విఘడియలు - 1 ఘడియ - 24 నిముషములు
2 1/2 విఘడియలు - 1 నిముషము
2 1/2 ఘడియలు - 1 గంట
7 1/2 ఘడియలు - 1 జాము - 3 గంటలు
10 విఘడియలు - 4 నిముషములు
60 ఘడియలు - 1 దినము - 24 గంటలు
8 జాములు - 1 రోజు
12 గంటలు - 1 పగలు
12 గంటలు - 1 రాత్రి
1 పగలు + 1 రాత్రి - 1 రోజు
7 రోజులు - 1 వారము
4 వారములు - 1 నెల - 30 రోజులు
365 రోజులు - 12 నెలలు - 1 సంవత్సరము
12 సంవత్సరములు - 1 భగణము
60 సంవత్సరములు - 5 భగణములు
కలియుగ ప్రమాణము - 4,32,000 సంవత్సరములు

సంవత్సరాలు:
1.ప్రభవ
2.విభవ
3.శుక్ల
4.ప్రమోదిత
5.ప్రజోత్పత్తి
6.అంగీరస
7.శ్రీముఖ
8.భవ
9.యువ
10.ధాత
11.ఈశ్వర
12.బహుధాన్య
13.ప్రమాది
14.విక్రమ
15.వృష
16.చిత్రభాను
17.స్వభాను
18.తారణ
19.పార్ధివ
20.వ్యయ
21.సర్వజిత్తు
 22.సర్వధారి
 23.విరోధి
 24.వికృతి
 25.ఖర
26.నందన
27.విజయ
 28.జయ
 29.మన్మథ
 30.దుర్ముఖి
31.హేవళంబి
 32.విళంబి
 33.వికారి
 34.శార్వరి
 35.ప్లవ
36.శుభకృతు
 37.శోభకృతు
 38.క్రోధి
 39.విశ్వావసు
 40.పరాభవ
41.ప్లవంగ
 42.కీలక
 43.సౌమ్య
 44.సాధారణ
 45.విరోధికృతు
46.పరీధావి
 47.ప్రమాదీచ
 48.ఆనంద
 49.రాక్షస
 50.నల
51.పింగళ
 52.కాళయుక్తి
 53.సిద్ధార్ధి
 54.రౌద్రి
 55.దుర్మతి
56.దుందుభి
57.రుధిరోద్గారి
 58.రక్తాక్షి
 59.క్రోధన
 60.అక్షయ

నెలలు:
1.చైత్రం2.వైశాఖం3.జ్యేష్టం4.ఆషాడం
5.శ్రావణం6.భాద్రపదం7.ఆశ్వయుజం8.కార్తీకం
9.మార్గశిరం10.పుష్యం11.మాఘం12.ఫాల్గుణం

నక్షత్రాలు:
1.అశ్విని2.భరణి3.కృత్తిక
4.రోహిణి5.మృగశిర6.ఆరుద్ర
7.పునర్వసు8.పుష్యమి9.ఆశ్లేష
10.మఖ 11. పుబ్బ12.ఉత్తర
13.హస్త14.చిత్త15.స్వాతి
16.విశాఖ17.అనురాధ 18.జ్యేష్ఠ
19.మూల  20.పూర్వాషాఢ 21.ఉత్తరాషాఢ
22.శ్రవణం 23.ధనిష్ఠ 24.శతభిషం
25.పూర్వాభాద్ర 26.ఉత్తరాభాద్ర 27.రేవతి

27 నక్షత్రములు - 12 రాశుల సంబంధము:

  1. అశ్విని భరణి కృత్తికాః పాదం - మేషం
  2. కృత్తికాత్రిపాదం రోహిణి మృగశిరార్థం - వృషభం
  3. మృగశిరార్థం ఆర్ర్ద పునర్వసూస్త్రయోః - మిథునం 
  4. పునర్వసూపాదం పుష్యమి ఆశ్లేషాంత్యం - కర్కాటకం
  5. మఖ పుబ్బ ఉత్తరాపాదం -సింహం
  6. ఉత్తరాత్రిపాదం హస్త చిత్తార్థం - కన్య
  7. చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయః - తుల
  8. విశాఖాపాదం అనూరాధ జేష్ఠాంత్యం - వృశ్చికం
  9. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢాః పాదం - ధనస్సు
  10. ఉత్తరాషాఢాత్రిపాదం శ్రవణ ధనిష్ఠార్థం - మకరం
  11. ధనిష్ఠార్థం శతభిష పూర్వాభాద్రాస్త్రయః - కుంభః
  12. పూర్వాభాద్రా పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం
అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము - 9 పాదములు అనగా 1 రాశి. ఇటులనే 12 రాశులకు 108 పాదములు.

9 నక్షత్రములు - 36 పాదములు - 4 రాశులు - 1 నవకం

తిథులు:
1.పాడ్యమి8.అష్టమి
2.విదియ9.నవమి
3.తదియ10.దశమి
4.చవితి11.ఏకాదశి
5.పంచమి12.ద్వాదశి
6.షష్ఠి13.త్రయోదశి
7.సప్తమి14.చతుర్దశి
శుక్ల పక్షంలో పౌర్ణమి లేక కృష్ణ పక్షంలో అమావాస్య

వారాలు:
1.ఆదివారము
2.సోమవారము
3.మంగళవారము
4.బుధవారము
5.గురువారము
6.శుక్రవారము
7.శనివారము

నామ నక్షత్రములు

  1. అశ్విని                 చూ చె చౌ
  2. భరణి                  - లీ లూ  లే లో
  3. కృత్తిక                 -
  4. రోహిణి                - వా వీ వు
  5. మృగశిర             - వే వో కా కి
  6. ఆరుద్ర                - కూ ఘం చ్ఛ
  7. పునర్వసు           -           కే    కో  హ   హి
  8. పుష్యమి             - హూ హే హో  డ
  9. ఆశ్లేష                  - డీ డూ డే డో
  10. మఖ                   - మా మీ మూ మే
  11. పుబ్బ                 - మో టా టీ టు
  12. ఉత్తర                  - టే టో పా పి
  13. హస్త                   - పూ ణా
  14. చిత్త                    - పే పో రా రి
  15. స్వాతి                 - రూ రే రో
  16. విశాఖ                 - తీ తు తే తో
  17. అనురాధ             - నా నీ నూ నె
  18. జ్యేష్ఠ                    - నో యా యి యు
  19. మూల                 - యే యో బా బి
  20. పూర్వాషాఢ - బు బా
  21. ఉత్తరాషాఢ            - బే బో జా జి
  22. శ్రవణం                  - జూ జే జో
  23. ధనిష్ఠ                   - గా గీ గూ  గే
  24. శతభిషం               - గో సా సీ సు
  25. పూర్వాభాద్ర - సే సో దా ది
  26. ఉత్తరాభాద్ర            - దు శ్చం ఛా
  27. రేవతి                    - దే దో చా చి
ఒక నక్షత్రమునకు 4 పాదములు. చూ చె చౌ ల - అశ్విని నక్షత్రము 4 పాదములు. ఇటులనే 27 నక్షత్రములకు కలిపి 108 పాదములు.

Thursday, December 20, 2012

వివాహ మైత్రి అష్ట కూటములు


వర్ణ కూటమి - 1



వశ్య కూటమి - 2



తారా కూటమి - 3


యోని కూటమి - 4




గ్రహ కూటమి - 5





గణ కూటమి - 6



రాశి కూటమి - 7



నాడీ కూటమి - 8




అష్ట కూటములు చూచు విధానం:

ఉదాహరణ:
వధువు - ఆరుద్ర 2వ పాదం(మిథున రాశి)
వరుడు - పూర్వాషాడ 3వ పాదం(ధనుః రాశి)

ఈ కూటములన్నియు వధువు రాశి నుండి వరుని రాశి వరకు చూడవలెను.

వర్ణ కూటమి     - 1      (మిథునం - శూద్ర,ధనుః - క్షత్రియ)
వశ్య కూటమి    - 2      (మానవ,మానవ)
తారా కూటమి   - 3      (ఆరుద్ర నుండి పూ.షా)
యోని కూటమి  - 2      (శ్వానము,వానరము)
గ్రహ కూటమి     - 1/2   (బుధ,గురు)
గణ కూటమి      - 6      (మను,మను)
రాశి కూటమి     - 7      (మిథున,ధనుః)
నాడీ కూటమి    - 8      (ఆది,మధ్య)
మొత్తం కూడిన  - 29 1/2

18 గుణములకు పైన వచ్చిన వివాహము శుభప్రదము.



గుణమేళనచక్రము
 (సూక్ష్మంగా గుణములు లెక్కించు పట్టిక)