ఈ పండుగను జరుపుకొనుటను పురాణాలలో అనేక విధములుగా వున్నది.
1.విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి పధ్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి సీతతో కలిసి రాజ్యమునకు వచ్చిన సంధర్బమున ప్రజలు ఆనందోత్సాహాలతో దీపములు అలంకరించి జరుపుకొన్న పండుగను దీపావళి.
2.విష్ణుమూర్తి వామన అవతరుడై రాక్షస రాజు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను అడిగి అతనిని పాతాళమునకు అనిచివేసినందుకు దేవతలు, నరులు అనందించి జరుపుకున్న పండుగ అని,
3.ద్వాపర యుగమందు నరకాసురుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు తన భార్య సత్యబామతో కలిసి సంహరించినందుకు ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారు అని వివిధ కథలు ఉన్నయి.
నరకాసురుని వధ ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున జరిగింది. కనుక ఈ రోజును నరక చతుర్దశి అని అంటారు. మరుసటి రొజు దీపావళి. ఈ పండుగను 2 రోజులు జరుపుకుంటాము.రోజున ఉదయం తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి,లక్ష్మీ పూజను జరుపుతారు. పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే ఇంటిని పూలతో,దీపములతో అలంకరించి టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి.
No comments:
Post a Comment