Friday, September 3, 2010

వినాయక చవితి

వినాయక వ్రత విధానం:

ఆచమనం:(పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
    ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము:(3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి)
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||

ప్రార్థన:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

సంకల్పం:
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షినాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే , చవితితిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం వర్షే, వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిష్య, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్తం కల్పొక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షొడషొపచార పూజాం కరిష్యే (నీళ్లు తాకవలెను). 
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశపూజాం కరిష్యే.

For Canada:

ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, క్రౌంచ ద్వీపే, రమనక వర్షే, ఇంద్ర ఖండే, రమ్యక పశ్చిమదేశే, అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి),వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షినాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే , చవితితిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం వర్షే, వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిష్య, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్తం కల్పొక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షొడషొపచార పూజాం కరిష్యే (నీళ్లు తాకవలెను).
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశపూజాం కరిష్యే.

కలశ పూజ:
(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షితలద్ది  లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి)
కలశం గంధ్పుష్పాక్షతైరభ్యర్చ్య |
తస్యోపరి హస్తం నిధాయ ||
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:| 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:|| 
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా| 
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:| 
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:|| 
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి| 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు|| 
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య ||
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి.

గణపతి పూజ:
ఓం గణాంత్వాం గణపతిం హవామహే కవింకవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ట రాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత్య: ఆనశ్రుణ్వన్నూతిభిసీద సాదనం 
మహాగణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి
పాదయోః పాద్యం సమర్పయామి
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఔపచారిక స్నానం పరికల్పయామి 
వస్త్ర యుగ్మం సమర్పయామి
ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి
గంధం ధారయామి
హరిద్ర కుంకుమ పరిమళద్రవ్యాణి సమర్పయామి
పుష్పైః పూజయామి

ఓం  సుముఖాయ నమః
ఓం  ఏకదంతాయ నమః
ఓం  కపిలాయ నమః
ఓం  గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయనమః 
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవేనమః
ఓం గణాధ్యక్ష్యాయనమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయనమః
ఓం శూర్పకర్ణాయనమః
ఓం హేరంబాయనమః
ఓం స్కంద పూర్వజాయనమః
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం పుష్పైః పూజయామి

నానావిధ పరిమళ పత్ర పుష్పైః పూజయామి , ధూప మాఘ్రాపయామి , సాక్షాద్దీపం దర్షయామి , నైవేద్యం పరికల్పయామి , ఊగీఫలతాంబూలం సమర్పయామి , కర్పూరనీరజనం దర్శయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.

నమస్తే దేవదేవేశ నమస్తే గణనాయక
పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలన
సమస్త జగదధార వరమూషిక వాహన
ప్రార్ధనాం సమర్పయామి

అథ ప్రాణప్రతిష్ఠ:
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః మిహనో ధేహి భోగం జ్యోక్పశ్యేమసూర్య ముచ్చరం తమనుమతే మృళయా నస్వస్తి
స్వామిన్ సర్వజగన్నాధ యావత్పూజావసానకం |
తావత్త్వం  ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు.  
ఆవాహితోభవ, స్థాపితోభవ, సన్నిహితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ 
మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిదోభవ 

సిద్ధి వినాయక పూజ:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాకుశధరందేవం ధ్యాయే త్సిద్ధి వినాయకం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
ధ్యాయామి ఆవహయామి 
మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం| 
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం|| 
ఆసనం సమర్పయామి 
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక| 
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణద్విరదానన| 
పదయోః పాద్యం సమర్పయామి. 
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన| 
గ్రుహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం| 
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత| 
గ్రుహాణచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభొ 
ముఖే ఆచమనీయం సమర్పయామి. 
దధ్యాజ్య మధుసంయుక్తం మధుపర్కం మయాహృతం 
గ్రుహాణ సర్వలోకేశ గణనాధానమోస్తుతే 
మధుపర్కం సమర్పయామి. 
పయోదధిఘృతం చైవ శర్కరా మధుసంయుతం 
పంచామృతేన స్నపనం క్రియతాంగణనాయక 
పంచామృతస్నానం సమర్పయామి. 
గంగాది సర్వతీర్ధేభ్యః ఆహృతై రమలైర్జలై: 
స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే 
శుద్ధొధకేన స్నపయామి 
రక్తవస్త్ర ద్వయంచారు దేవయోగ్యంచ మంగళం 
శుభప్రదం గ్రుహాణత్వం లంబోదర హరాత్మజ 
వస్త్రయుగ్మం సమర్పయామి. 
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చొత్తరీయకం 
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తా భీష్ట ప్రదాయక 
యజ్ఞోపవీతం సమర్పయామి 
నానావిధాని దివ్యాని నానారత్నోజ్వలానిచ
భూషణాని గృహాణేశ పార్వతీ ప్రియనందన
దివ్యాభరణాని సమర్పయామి 
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం 
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం 
గంధాన్ ధారయామి. 
హరిద్రా కుంకుమ పరిమళ ద్రవ్యాణి అక్షతాంశ్చ సమర్పయామి
సుగంధాని సుపుష్పాణి జాతే కుంద ముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే
పుష్పైః పూజయామి

ఆధాంగ పూజ:
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి| 
ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి| 
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి|
ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి| 
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి| 
ఓం హేరంబాయ నమః కటిం పూజయామి| 
ఓం లంబొదరాయ నమః ఉదరం పూజయామి| 
ఓం గణనాధాయ నమః నాభిం పూజయామి|
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి| 
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి| 
ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి| 
ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి| 
ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి| 
ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి| 
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి| 
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి| 
ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి| 
ఓం విఘ్నరాజయ నమః సర్వాణ్యంగాని పూజయామి|

అథ ఏకవింశతి పత్ర పూజ:
(ఒక్కొక్క నామం చదువుతూ పత్రి తీసుకుని స్వామిని పూజించాలి)
ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి |(మాచీ పత్రం)
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి |(వాకుడు ఆకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి |(మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి |(గరిక)
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి |(ఉమ్మెత్త ఆకు)
ఓం లంబోదరాయ నమః  అపామార్గ పత్రం పూజయామి |(రేగు ఆకు) 
ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి |(తులసీ ఆకు)
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి |(మామిడి)
ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి |(విష్ణుకాంత)
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి|(దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి|(దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి|(మరువం)
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి|(వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి|(జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి|(గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి|(జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్ధ పత్రం పూజయామి|(రావి)
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి|(మద్ది)
ఓం కపిలాయనమః అర్క పత్రం పూజయామి|(తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రైః పూజయామి|


శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళిః (ఒకొక్క నామాన్ని పూలు,కుంకుమ,పసుపు స్వామి వారికి వేస్తూ చదవాలి)

ధూపం:
దశాంగంగుగ్గులోపేతం సుగంధంచ మనోహరం|
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
ధూప మాఘ్రాపయామి
(అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించాలి)

దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా|
గృహాణ మంగళం దీపం త్రైలోక్య ఏశపుత నమోస్తుతే||
దీపం దర్శయామి
(దీపాన్ని స్వామికి చూపించాలి)

నైవేద్యము:
సుగంధన్ సుకృతంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్|
నైవేద్యం గృహ్యతాం దేవచణమూద్గైః ప్రకల్పితాన్|
భక్ష్యం భోజ్యంచలేహ్యంచ చోష్యం పానీయ మేవచ|
ఇదంగృహాణనైవేద్యం మయాదత్తం వినాయక||
మోదకసహితం మహానైవైద్యం పరికల్పయామి
(నైవేద్యం పైన నీరు చల్లి స్వామికి నివేదించాలి)

తాంబూలం:
ఊగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం|
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం||
తాంబూలం సమర్పయామి
(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలం స్వామి వారి దగ్గర ఉంచి నమస్కరించాలి)

నీరాజనం:
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ఘృతవర్తి సహస్త్రైశ్చ కర్పూరరశకలై స్తధా|
నీరాజనం మయాదత్తం గౄహాణ వరదో భవ||
నీరజనం దర్శయామి
(కర్పూరం వెలిగించి హారతి ఇచి, హారతి పాత్ర పై నీల్లు అక్షింతలు వుంచి కళ్ళకు అద్దుకోవాలి)

మంత్రపుష్పం:
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ||
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన |
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)

ప్రదక్షిణం:
(అక్షతలు చేతిలో ఉంచుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్షతలు చల్లి నమస్కరించాలి)
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం క్ర్పయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

పునః పూజాం:
యస్య స్మృత్యాచనామోఖ్య తపః పూజాక్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యోవందే తం గణాధిప
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజాయాచ
అష్టోత్తర నామార్చనయా చ అవసర, మహానివేదన యాచ భగవాన్
సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణధిపతి దేవతార్పణమస్తు
శ్రీమహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదోభవతు
                               
సిద్ధి వినాయక వ్రత కధ:
(అక్షతలు చేతిలో ఉంచుకుని కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి)
బ్రహ్మాండనాయకుడైన భగవంతుని సృష్టిలో ఆర్యావర్తమను పుణ్యభూమి కలదు. ఇందలి నైమిశారణ్యములో అనేక ధర్మ శాస్త్రపురాణేతిహాసకోవిదుడైన సూత మహర్షి శౌనకాదిమునులకు ధర్మ శాస్త్ర రహస్యములను బోధించుచుండును. ఇట్లుండగా ఒకసారి చంద్రవంశసంజాతుడైన ధర్మనందనుడు జ్ఞాతులవలన రాజ్యము పోగట్టుకొని సోదరులతో కూడి అడవుల పాలై సూతమహర్షిని సందర్శించి తన కష్టములు తీరునట్టి వ్రతమునేదైన ఉపదేశింపుడని కోరెను. అంత సూత మహర్షి ధర్మజా! నీ సంకటములను తీర్చునట్టి వ్రతమొక్కటి కలదు. దీనిని పూర్వము సదా శివుడు కుమారస్వామి కుపదేశించెను. దాని పేరే వినాయక వ్రతము. దీనిని భాద్రపద శుక్లపక్ష చతుర్ధినాడు ఆచరింపవలయును. ఊదయమున స్నానము చేసి శుచిర్బూతుడై నిత్య కృత్యముల ముగించి విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి, గందాక్షత పుష్పదూర్వంకురములతో పూజించి మోదకములు నైవేద్యముగ సమర్పించి కల్పొక్తకము ముగింపవలయును. ఈ వ్రతమునిట్లు ఆచరించిన వారికి సర్వవిఘ్నములు తోలగి ఇష్టార్ధములు నెరవేరును. ధర్మనందనా! ఈ వ్రతమాచరించి దమయంతి నలుని పెండ్లాడెను. శ్రీకృష్ణ పరమాత్మ కూడ ఈ వ్రతాన్ని ఆచరించి శమంతకమణితో బాటు జాంబవతిని పొందగలిగినాడు. అందుచేత ధర్మజా! ఈ వ్రతాన్ని చేసి నీవు కూడ వాంఛితార్ధములు పొందమనెను.

గజాననోత్పత్తి:

పూర్వము గజరూపముగల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపము చేసెను. పరమశివుడు సంతుష్టుడై వరము కోరుకొమనగా, గజాసురుడు స్వామీ ఎల్లప్పుడు నీవు నా ఉదరమునందే నివసింపవలెనని కోరెను. భోళాశంకరుడందుల కంగీకరించెను. ఈశ్వరుడు కనబడకపోగా పార్వతి దుఃఖితయై గజాసురుని గర్భమునందున్నట్లు తెలుసుకొని విష్ణుమూర్తి నాశ్రయించి తన భర్త నెట్లైన ఇప్పింపుమని కోరెను.అంత విష్ణుమూర్తి నందిని గంగిరెద్దును చేసి దేవతలు వెంటరాగా గజాసురుని సమీపించి చిత్రవిచిత్రములైన గతులతో గంగిరెద్దు నాడించెను. గజాసురుడు సంతోషపడి వరము కోరుకొమ్మనెను. అంతట విష్ణుమూర్తి "ఈ గంగిరెద్దే నందీశ్వరుడు శివదర్శనాన్ని కోరుతున్నడు. శివుని మాకిచ్చివేయు" మని కోరెను. గజాసురుడాశ్చర్యపడి వచినవానిని జగన్నాటక సూత్రధారియైన శ్రీహరిగ గుర్తించి తనకు మరణము తప్పదని తెలుసుకొని మహేశ్వరా నాశిరమును త్రిలోకపూజ్యముగ చేసి, నా చర్మమును నీవు ధరింపుమని కోరుచు వరము నడిగెను. నంది గజాసురుని చీల్చి శివదర్శనము చేసెను. ఈ విధముగ విష్ణుమూర్తి పార్వతి వాంఛితమును తీర్చి వైకుంఠమున కరిగెను.

కైలాసమున పార్వతి తన భర్త రాకను విని సంతోషమోంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుపిండితో నొక బాలుని చేసి ప్రాణమును పోసి సింహ ద్వారమున కాపుంచెను. పరమ శివుడు వచ్చి నంది నారోహించి లోనికి పోబోవ బాలకుడు అడ్డగింపగా శూలమున వాని శిరము త్రుంచి ప్రవేసించెను. తరువాత విషయము తెలిసికొని పశ్చాత్తాప పడుచు గజాసుర శిరము నుంచి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, వానికి విఘ్నాధిపత్యమునిచ్చి గజానన నామమునిడి గణనాయకుని చేసెను. భాద్రపదశుద్దచవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యము వచ్చినందున ఆనాడు అందరూ వివిధములైన అపూపములనారగింపచేసి గజాననుని పూజించిరి. గణపతి కడుపునిండ భుజించి తల్లి తండ్రులకు సాష్టంగ నమస్కారము చేయనుద్యమించెసు. ఉదరము నేలకు ఆనుకొనగా, కాళ్లు పైకి లేచి చేతులందక శ్రమపడుచున్న గణపతిని చూచి శివుని శిరముపై నున్న చంద్రుడు వికటముగ నవ్వెను. అంత గణనాయకుదు ఈనాటి చంద్రుని చూచిన వారు నీలాపనిందలకు గురి యయ్యేదరని చంద్రుని శపించెను. వెంటనే చంద్రుడు కళావిహీనుడై శాపమునుపసంహరించి క్షమింపుమని వేడెను. అంత విఘ్నేశ్వరుడు వినాయక వ్రతమును చేసి శ్యమంతక చరితము పఠించినవారికి అపనిందలు తొలగునని చెప్పెను.

శ్యమంతకోపాఖ్యానము:

ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మతో నారదుడొకనాడు మాట్లాడుతూ అయ్యా! ఇక సెలవిండు. ఈనాడు వినాయక చతుర్ధి, చంద్రదర్శనము కాక మునుపే నిజాశ్రమము చేరుకొనవలెననెను. అనుమతిస్తూ శ్రీకృష్ణుడు పూర్వవృత్తాంతమును స్మరించి ఆనాటి రాత్రి చంద్రునెవ్వరూ చూడరాదని ద్వారకలో చాటింపించెను. తాను క్షీరప్రియుడగుట చేత శ్రీకృష్ణుడు ఆకాశంవైపు చూడకనే గోష్ఠములోని పాలకుండలో ప్రతిబింబించిన చంద్రబింబాన్ని చూచి ఆహా! నాకేమి అపనిందరానున్నదో అని సందేహపడెను.

కొన్నాళ్ళకు సూర్యవంశ సంజాతుడైన సత్రజిత్తు సూర్యారాధన చేసి శ్యమంతకమణిని సంపాదించి కృష్ణదర్శనార్ధమై ద్వారకకు వచ్చెను. అతిధి సత్కారమైన పిదప శ్యమంతకమణిని తనకిమ్మని శ్రీకృష్ణుడడిగెను. అందులకు సత్రాజిత్తు అయ్యా! ఇది దినమునకు ఎనిమిది బారువల బంగారమును ప్రసవించునట్టిది. దీనిని ఎంతటి ఆప్తుని కైనను ఇవ్వననెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శ్యమంతకమణిని కంఠమున ధరించి వేటకు వెళ్ళెను. అక్కడ సింహమొకటి మణిని చూచి మాంసఖండమని భ్రమించి అతనిని చంపి మణిని నోటకరచుకొని పోవుచుండెను. దానిని మార్గమధ్యముననే జాంబవంతుడు సంహరించి ఆ మణిని తన గుహకు తీసికొని పోయి తనకుమార్తె యగు జాంబవతికి ఆటవస్తువుగనిచ్చెను. సత్రాజిత్తు తన తమ్ముని మరణవార్తవిని శ్రీక్రిష్ణుడే ప్రసేనుని వధించి మణినపహరించెనని చాటెను. తనపైబడిన అపవాదమును తొలగించుకొనుటకై శ్రీకృష్ణుడు బయలదేరి అడవిలో ప్రసేనుని కళేబరమును చూచి, దానివెంటనున్న సింహపు కాలిజాడను, భల్లూకచరణ విన్యసమును అనుసరించుచూ జాంబవంతుని గుహజేరి ఉయ్యాలకు కట్టిన శ్యమంతకమణిని చూచెను. దానిని చేతపుచ్చుకొని వెళ్ళబోవుచుండగా జాంబవంతుడు పైబడి శ్రీకృష్ణునితో యుద్ధమునకు తలపడెను. క్రమక్రమముగ తన బలము సన్నగిల్లుటతో వచ్చినవాడు శ్రీరామావతారమేనని గ్రహించికాళ్ళపైబడి క్షమింపుమని వేడెను. జాంబవంతుడు మణితోబాటు జాంబవతిని కూడ శ్రీకృష్ణునకిచ్చెను. కృష్ణుడు ద్వారకకు చేరి జరిగినదంతయూ వివరించి మణిని సత్రజిత్తునకిచ్చెను. సత్రజిత్తు అనవసరముగ కృష్ణునిపై అపనింద మోపినందులకు పశ్చాత్తప్తుడగుచు తనకుమార్తైయైన సత్యభామతో పాటు శ్యమంతకమణిని కూడ శ్రీకృష్ణునకు కానుకగ ఇచ్చెను. కృష్ణుడు సత్యను స్వీకరించి మణిని సత్రజిత్తునకే ఇచ్చివేసి నీలాపనిందను బాపుకొనెను. మఱియు వృత్రాసురుని హతమార్చునపుడు ఇంద్రుడు, సీతాదేవిని వెదుక బూనినపుడు శ్రీరాముడు, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులు, గంగను భూమికి తెచ్చునపుడు భగీరథుడు, వ్యాధినివృత్తి కొఱకై సాంబుడు ఈ వినాయక వ్రతమును చేసి విజయమునొందిరి.

భాద్రపద శుద్దచతుర్థినాడు ప్రమాదవశమున చంద్రదర్శనమైనచో యథావిధిగ గణపతి నర్చించి శ్యమంతకోపాఖ్యానము చదివి అక్షతలు శిరమున తాల్చినచో నీలాపనింద తొలగి పోవునని శౌనకాదులకు తెల్పి సూతమహర్షి నిజాశ్రమమునకరిగెను.

నాగుల చవితి

                                   

శ్రావణ శుక్ల చవితినాడు "నాగుల చవితి" పర్వదినముగా జరుపుకుంటాము. ఈరోజు ఉదయమునే తల స్నానం చేసి మడి/తడి బట్టలు ధరించి నాగులకు ఆవుపాలు పోసి సుబ్రమణ్య స్వామికి ఉపవాసం వుంటామని చెప్పాలి.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షోడషోపచార పూజ చేయాలి. 

నైవేద్యం:
పచ్చి నూగులు, బెల్లం కలిపి నూగుల ఉండలు చేయాలి మరియు బియ్యపు పిండి, బెల్లం కలిపి చలివిడి ఉండలు చేసి స్వామివారికి సమర్పించాలి.




ఉపవాసం ఉన్నవారు ఆ నైవేద్యమును మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. మరుసటి రోజు పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టి ఉపవాసం విడిచి నైవేద్యం స్వీకరించాలి. ఈ విధముగ భక్తితో సేవించినవారి దోషాలు తొలగి సుఖశాంతులతొ వర్ధిల్లగలరు.

Friday, January 29, 2010

కృష్ణాష్టమి


        ద్వాపర యుగములో రోహిణి నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు ఈ రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటాము.ఈ రోజు వేకువతోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీదళాలు వేసిన నీటితొ స్నానం చేయాలి.అలా చేస్తే సమస్త నదుల్లొ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.పగలు ఉపవాసం వుంటూ పూజా కార్యక్రమం జరుపవలెను. ఈ రోజు చిన్ని కృష్ణుని పాదాలు వేయడం అనవాయితి.అలా చేస్తే చిన్ని కృష్ణుడు వస్తాడని పూర్వం నుండి నమ్మకం. పూజ ముగిసిన తర్వత పాలతో  కాని, పెరుగుతో కాని, అటుకులతో  చేసిన నైవేద్యం పెట్టాలి.

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

నైవేద్యం : 

అటుకుల పాయసం:
కావలసినవి:
అటుకులు  -  పావు కేజీ,
పాలు     -  లీటరు,
చక్కెర - పావుకేజీ,
ఏలకుల పొడి - అర టీ స్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
కిస్‌మిస్   - పది
నెయ్యి   -  జీడిపప్పు, కిస్‌మిస్ వేయించడానికి తగినంత

తయారి:
ముందుగా పాలను సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ లోపుగా అటుకులలో ఉండే సన్నని దుమ్ము, పొట్టు పోయేటట్లు నీటిలో వేసి పిండి అరబెట్టలి. పాలు కాగిన తర్వాత ఏలకుల పొడి, అటుకులు వేసి కలిపి దించేయాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.


Monday, January 25, 2010

శ్రీ హనుమజ్జయంతి


యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలీం|
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే ||
అంజనానందం వీరం జానకీ శోకనాశనం |
కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం ||

ఆంజనేయ స్వామి వారి జననం వైశాఖమాసం, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జరిగింది. అంజనాదేవి, కేసరీ దంపతులకు వాయుదేవుని వరప్రభావముచే ఆంజనేయుడు జన్మించాడు. శ్రీ అంజనేయ స్వామి వారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. దీనినే హనుమజ్జయంతి అని కూడా అంటాము. భక్తతులసిదాస్ కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొనుచున్నాడు. 'రామాయణంలోని అంజనేయుడు జీవించి వుంటాడా?' అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవి అతులిత బలధాముడు మహాయోగి.

ఆంజనేయుడు పుట్టిన కొద్ది దినములలోనే సూర్యుని పండుగా భ్రమించి, మింగబోవగా ఇంద్రుడు వజ్రాయుధముతో అనువు(దవడ) మీద కొట్టగా స్పృహ కోల్పోగా వాయుదేవునికి కోపంవచ్చి ఆంజనేయుని తీసుకొని ఎవరికీ కానరాక దాగియుండెను. ఆ సమయంలో లోకములలో గాలి ఆడక జీవులన్నీ కటకటలాడిపోవగా, అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యి ఆంజనేయుడు చిరంజీవి అనియు విశేష పరాక్రమశాలి అనియు వరములిచ్చి "హనుమ" అని పిలిచి వాయుదేవుని శాంతింపజేసిరి. అప్పటినుండి ఆంజనేయునుని హనుమంతుడు అని పిలిచారు.

హనుమంతుడు సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి చతుర్వేదాలు నేర్చుకున్నాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉండి, రామ-సుగ్రీవులకు మైత్రిని నెలకొల్పాడు. సీతాన్వేషణకు కూడా ముఖ్య పాత్రధారి అయ్యాడు.

హనుమకు వాహనం 'ఒంటె'. హనుమకి సింధూరం అంటే ప్రీతి. ఒకనాడు సీతమ్మవారు నుదుటన సింధూరం ధరించగా హనుమ ఇలా అడిగాడంట అమ్మా నుదుటన సింధూరం ఎందుకు ధరించారు అని, అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు నుదుటన సింధూరం ధరిస్తే నా పతికి మంచి జరుగుతుంది అని. వెంటనే హనుమ ఐతే నేను నా వళ్ళంతా సింధూరం పూసుకుంటాను అలా ఐతే నా స్వామికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నాడు. అప్పటినుండి హనుమకు వళ్ళంతా సింధూరం పూస్తారు. స్వామికి తమలపాకులన్నా ప్రీతి ఎక్కువ.

ఆంజనేయ పూజితస్చేత్ పూజితా సర్వదేవతాః |
హనుమన్మహిమా శక్యో బ్రహ్మణాపిన వర్ణితుమ్ ||

భావం:
ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. బ్రహ్మ దేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ.

పూజా విధానం :


(ఈ ద్వాదశ నామాలు అనునిత్యం త్రికాలములలో జపిస్తే శత్రుభయం అనేది ఉండదు)

హనుమంతుని పటం పూజా మందిరంలో పెట్టి షొడశోపచారములతొ పూజ చేయాలి. స్వామి వారికి మనకు తోచిన నైవెద్యం పెట్టి హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం చేకూరుతుంది.

Saturday, January 16, 2010

శ్రీ నృసింహ జయంతి


నృసింహజయంతి అనగా నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యాక్షుని సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను. కనుక ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరుపుతారు. 

వైశాఖ శుద్ధ చతుర్దశినాడు శ్రీ నృసింహాస్వామి వారి జయంతి మనము జరుపుకుంటాము. స్వామి వారు వైశాఖ మాస శుక్ల పక్షంలొ పూర్ణిమ ముందు వచ్చే చతుర్దశినాడు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యా కాలంలొ ఇటు పగలు అటు రాత్రి కానివేళ ఇటు నరుడు అటు జంతువు కాని రూపంతో అటు భూమి ఇటు ఆకాశం కాని తన తొడల పై హిరణ్యకశ్యపుని పొట్టను చీల్చి ప్రేగులు మెడలొ వేసుకొని ప్రళయ గర్జనలు చేస్తూ భూనభొంతరాళాలు దద్దరిల్లినట్టు గా సింహనాదం చేస్తూ మధ్యాహ్న సూర్యునివలె ఆవిర్భవించాడు శ్రీ నారసింహమూర్తి.

వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే |
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ||

ఈ రోజు బ్రహ్మముహూర్తంలొ లేచి తలస్నానమాచరించి శ్రీ స్వామివారిని కొబ్బరినీళ్ళతో, తేనెతో, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సమన్వితంగ అభిషేకించి శ్రీ నారసింహ సహస్రనామ స్తొత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు, పానకము నివేదన చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ విధంగా నృసింహ జయంతి జరుపుకోవాలి.

శ్రీ రామనవమి


శ్రీ రామచంద్రమూర్తి జన్మించిన రోజున మనము శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటున్నాము. అదే విధంగ సీతారాముల కళ్యాణం కూడా ఆరోజే. శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి దిగ్విజయంగ అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడ ఈరోజే. మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీ రామపట్టాభిషేకము జరిగినది. ఇది ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు. ఈ రోజున ధనశక్తికొలది ప్రతివారూ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహమును కానీ  శ్రీరామ పట్టాభిషేక పటమును కాని పెట్టి పూజించాలి.

పూజా విధానము :-
ఫూజా మందిరంలో  రాముని ప్రతిమను పెట్టి అలంకరించి షొడషోపచారములు చేసి పానకము, వడప్పప్పు, మజ్జిగ నైవేద్యమిచ్చి కర్పూర హారతినీయవలెను. తర్వాత ఒక బ్రాహ్మణుడిని శ్రీ రాముడిగ భావించి విసనకర్ర, పానకం, వడప్పప్పు, మజ్జిగ ఇచ్చి అతని అశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకొనవలెను.

నైవేద్యం:

వడపప్పు :-
పెసరపప్పుని నీటిలొ నానబెట్టి పెసరపప్పు బాగా నానాక నీటిని వంపేయాలి.


పానకం :-
నీటిలో బెల్లం వేసి కలపాలి. దానికి యాలుకల పొడి చేర్చాలి.


మజ్జిగ :-
పెరుగును చిలికి ఉప్పు వేసి కరివేపాకు,కొత్తిమీరతొ తిరువాత వేయాలి.


ఉగాది

          మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు  ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనము చేయవలసిన విధులు. ఉదయం 5:30 గంటలలొపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. తిలకం ధరించి,నూతన వస్త్రములను ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, అర్ఘ్యము, దీపం, ధూపం సమర్పించి ఆ తర్వాత "వేపపూత పచ్చడి" విధిగా తినాలి.

వేపపూత పచ్చడి:

కావలసినవి:

  1. వేపపూత 
  2. కొత్త బెల్లం
  3. కొత్త చింతపండు పులుసు
  4. మామిడికాయ తురుము
  5. పప్పుల పొడి
  6. కారం
  7. ఉప్పు


పైవన్ని కలిపి దేవుడికి నివేదించి ప్రసాదంగా మనం తీసుకొవాలి.



పంచాంగ శ్రవణం :-

ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణం వినుట వలన, తిథి వలన సంపదయునూ, వారము వలన ఆయుష్యమును, నక్షత్రము వలన పాప పరిహరమును,యోగము వలన వ్యాధిని వృత్తియునూ,కరణము వలన కార్యానుకూలమున్నూ కల్గును. ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారము, గోవులు, ధాన్యము, కన్యను దానము చేస్తే కల్గినంత ఫలితం కల్గుతుంది. అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రొక్తంగా వినుట వల్ల గ్రహదోషములు,నివారణ అయ్యి ,వినువారికి ఆరొగ్యమూ,ఆయుష్యును,సంపదల యందు శుభఫలితాలు కల్గును.


Friday, January 15, 2010

మన పండుగలు

పండుగల ప్రాముఖ్యత

ఈనాడు మనం జరుపుకునే పండుగలు శ్రీమహాభారత కర్తైన శ్రీ వేదవ్యాసుమహర్షి వేదాలనువిభజించి పురణాలను రచించి యావత్ మానవాలికి ఈ పర్వదినాలు ప్రసాధించాడు.మనం జరుపుకునే పెళ్ళి,వడుగు,బారసాల మొదలగు పుణ్య కార్యాలకు కావలసిన విధులు తెలియజేశారు. హిందు పండుగలన్నిటికి నిత్యం సంధ్య వార్చుకోవాలన్న ముందుగా మనకు 'హిందూకాలమనం' తెలియాలి. ప్రతి  శుభకార్యమునకు 'సంకల్పం' లేకుండ మంత్రకాండ జరగదు. కనుక హిందువులమైన మనం హిందూకాలెండర్ తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మనకు ఏ పండుగ తర్వత ఏ పండుగ వస్తుందో, ఏమాసం తర్వాత ఏమాసం వస్తుందో  మనకు తప్పక తెలుస్తుంది.

ఇపుడు జరుగుతున్న కలియుగం యొక్క ' ఆది ' అంటే సంవత్సరం ప్రారంభకాలము (కలియుగ ప్రారంభ కాలము) ' ప్రమాది ' నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏర్పడిన గ్రహాల కూటమితో ప్రారంభమైనది. (ఇది సుమారు 5094 సంవత్సరముల క్రితం వచ్చినది) ఆరోజు శుక్రవారం, సూర్యగ్రహణం, అమావాస్య, అర్ధ్రరాత్రి అష్టగ్రహకూటమి  అన్నీ కలిసి మేషరాశి ప్రారంభ బిందువులొ కలిసిన కలమే  మన పంచాంగాలకు మూలం. ఆనాడే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. అదియే హిందూ క్యాలెండర్ కు మూలస్థంభం. ఆ రోజే సంవత్సరాది ప్రారంభం. ఆ చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం ప్రారంభమైన ' ఉగాది 'గా మారింది.