Tuesday, October 22, 2013

మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన

మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు ||2||

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు ||3||

పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||4||

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు ||5||

అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ||6||

అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు ||7||

కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు
||భువనేశ్వరీ|| ||8||

కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు ||9||

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ||10||

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ||11||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||12||

మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ||13||

కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ||14||

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ||15||

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||16||

మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||17||

సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు ||18||

సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ||19||

మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||20||

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||21||

దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||22||

శ్రీ విఘ్నేస్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ||23||

పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||24||

చింతామణులు నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ||25||

దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు ||26||

పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||27||

చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములొ
||భువనేశ్వరీ|| ||28||

మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములొ ||29||

పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2 సార్లు|| ||30||

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు ||2 సార్లు|| ||31||

శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
టిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై


భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||2 సార్లు|| ||32||

ఫలశృతి:

పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

Thursday, October 3, 2013

శ్రీ షిర్డీసాయి అష్టోత్తర శతనామావళి

ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణమారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతటశిరిడీవాసినే నమః
ఓం భక్తహృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః 
ఓం కాలాతీతాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః 
ఓం కాలదర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః 
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తావనసమర్థాయ నమః
ఓం భక్తావనప్రతిఙ్ఞాయ నమః
ఓం అన్నవస్త్రదాయ నమః 
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః 
ఓం ధనమాంగల్యదాయ నమః
ఓం బుద్ధిసిద్ధిదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః 
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గబంధవే నమః
ఓం భుక్తిముక్తిస్వర్గాసవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతివర్దనాయ నమః
ఓం అంతర్యామినే నమః 
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం ఆనందదాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం ఙ్ఞానస్వరూపిణే నమః
ఓం జగతఃపిత్రే నమః
ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః 
ఓం భక్తాభయప్రదాయ నమః 
ఓం భక్తపరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః 
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం భక్తిశక్తిప్రదాయ నమః
ఓం ఙ్ఞానవైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః 
ఓం సంశయహృదయదౌర్భల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః
ఓం హృదయగ్రంధిభేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః 
ఓం శుద్ధసత్వస్ధితాయ నమః
ఓం గుణాతీతగుణాత్మనే నమః
ఓం అనంతకళ్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః 
ఓం జయినే నమః 
ఓం దుర్దర్షాక్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేషుఅవిఘాతగతయే నమః 
ఓం అశక్యరహితాయ నమః
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః 
ఓం మహారూపవిశ్వమూర్తయే నమః 
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః 
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అసహాయసహాయాయ నమః 
ఓం అనాధనాధయే నమః 
ఓం సర్వభారభృతే నమః 
ఓం అకర్మానేకకర్మానుకర్మిణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్ధాయ నమః 
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం లోకనాధాయ నమః
ఓం పావనానఘాయ నమః 
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కరప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్దసంకల్పాయ నమః 
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
ఓం కామాదిషడ్వైరధ్వంసినే నమః
ఓం అభేదానందానుభవప్రదాయ నమః
ఓం సర్వమతసమ్మతాయ నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ్వరమణాయ నమః
ఓం అద్భుతానందచర్యాయ నమః
ఓం ప్రపన్నార్తిహరాయ నమః
ఓం సంసారసర్వదు:ఖక్షయకారకాయ నమః
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భహిస్థితాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం శ్రీ సమర్థసద్గురు సాయినాథాయ నమః
ఇతి శ్రీ షిర్డీసాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Wednesday, October 2, 2013

శ్రీ వెంకటేశ్వరాష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ వేంకటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మిపతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాంశాయ నమః
ఓం జగద్వంద్యాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేశాద్రినిలయాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం ఙ్ఞానపంజరాయ నమః
ఓం శ్రీవత్సవక్షసే నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం వ్తెకుంఠపతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం నిత్యయౌవనరూపవతే నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం సురపతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చక్రధరాయ నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నిరంతరాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిర్నాశాయ నమః
ఓం సద్గుణాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం శార్ఞ్ఙపాణయే నమః
ఓం నందకినే నమః
ఓం శంఖదారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబంధవే నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్శమందిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుటశోభితాయ నమః
ఓం నీలమేఘశ్యామతనవే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్సాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చింతితార్ధప్రదాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దాశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః
ఓం నిత్యతృప్త్తాయ నమః
ఓం నిరుపద్రవాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రణతారేజ్యాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాసక్తమానసాయనే నమః
ఓం అశ్వరూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జనసముత్సుకాయ నమః
ఓం ఘనసార సన్మధ్యకస్తూరి తిలకోజ్జ్వల లలాటాయ నమః
ఓం శంఖమధ్యోల్లన్మద కింకిణ్యాధ్యకరండకాయ నమః
ఓం సచ్చిదానందరూపాయ నమః
ఓం జగన్మంగళదాయకాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం యఙ్ఞభోక్రే నమః
ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరమార్ధప్రదాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రీపతే నమః
ఓం దోర్దండవిక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం శేషశైలాయ నమః
ఓం వేంకటేశ్వరాయ నమః
ఇతి శ్రీ వెంకటేశ్వరాష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Tuesday, October 1, 2013

శ్రీ రామాష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ రామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః 
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణతత్పరాయ నమః 
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వాంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవ పండితాయ నమః
ఓం విభీషణపరిత్రాతాయ నమః
ఓం హరకోదండఖండనాయ నమః
ఓం సప్తతాళప్రభేత్యై నమః 
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంతసారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తయే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండకారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం ఋక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంతత్రాణవరదాయ నమః
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
ఓం సర్వదేవాధిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధికఫలినే నమః
ఓం స్తృతస్సర్వౌఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహాపురుషాయ నమః
ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాదిపూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వతీర్దమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాసనే నమః
ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయఙ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః 
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మైబ్రహ్మణే నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః
ఓం పరస్మైధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరస్మై నమః
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళిః సంపూర్ణం