Friday, December 21, 2012

కాల మానము


60 విలిప్తలు - 1 లిప్త
60 లిప్తలు - 1 విఘడియ
60 విఘడియలు - 1 ఘడియ - 24 నిముషములు
2 1/2 విఘడియలు - 1 నిముషము
2 1/2 ఘడియలు - 1 గంట
7 1/2 ఘడియలు - 1 జాము - 3 గంటలు
10 విఘడియలు - 4 నిముషములు
60 ఘడియలు - 1 దినము - 24 గంటలు
8 జాములు - 1 రోజు
12 గంటలు - 1 పగలు
12 గంటలు - 1 రాత్రి
1 పగలు + 1 రాత్రి - 1 రోజు
7 రోజులు - 1 వారము
4 వారములు - 1 నెల - 30 రోజులు
365 రోజులు - 12 నెలలు - 1 సంవత్సరము
12 సంవత్సరములు - 1 భగణము
60 సంవత్సరములు - 5 భగణములు
కలియుగ ప్రమాణము - 4,32,000 సంవత్సరములు

సంవత్సరాలు:
1.ప్రభవ
2.విభవ
3.శుక్ల
4.ప్రమోదిత
5.ప్రజోత్పత్తి
6.అంగీరస
7.శ్రీముఖ
8.భవ
9.యువ
10.ధాత
11.ఈశ్వర
12.బహుధాన్య
13.ప్రమాది
14.విక్రమ
15.వృష
16.చిత్రభాను
17.స్వభాను
18.తారణ
19.పార్ధివ
20.వ్యయ
21.సర్వజిత్తు
 22.సర్వధారి
 23.విరోధి
 24.వికృతి
 25.ఖర
26.నందన
27.విజయ
 28.జయ
 29.మన్మథ
 30.దుర్ముఖి
31.హేవళంబి
 32.విళంబి
 33.వికారి
 34.శార్వరి
 35.ప్లవ
36.శుభకృతు
 37.శోభకృతు
 38.క్రోధి
 39.విశ్వావసు
 40.పరాభవ
41.ప్లవంగ
 42.కీలక
 43.సౌమ్య
 44.సాధారణ
 45.విరోధికృతు
46.పరీధావి
 47.ప్రమాదీచ
 48.ఆనంద
 49.రాక్షస
 50.నల
51.పింగళ
 52.కాళయుక్తి
 53.సిద్ధార్ధి
 54.రౌద్రి
 55.దుర్మతి
56.దుందుభి
57.రుధిరోద్గారి
 58.రక్తాక్షి
 59.క్రోధన
 60.అక్షయ

నెలలు:
1.చైత్రం2.వైశాఖం3.జ్యేష్టం4.ఆషాడం
5.శ్రావణం6.భాద్రపదం7.ఆశ్వయుజం8.కార్తీకం
9.మార్గశిరం10.పుష్యం11.మాఘం12.ఫాల్గుణం

నక్షత్రాలు:
1.అశ్విని2.భరణి3.కృత్తిక
4.రోహిణి5.మృగశిర6.ఆరుద్ర
7.పునర్వసు8.పుష్యమి9.ఆశ్లేష
10.మఖ 11. పుబ్బ12.ఉత్తర
13.హస్త14.చిత్త15.స్వాతి
16.విశాఖ17.అనురాధ 18.జ్యేష్ఠ
19.మూల  20.పూర్వాషాఢ 21.ఉత్తరాషాఢ
22.శ్రవణం 23.ధనిష్ఠ 24.శతభిషం
25.పూర్వాభాద్ర 26.ఉత్తరాభాద్ర 27.రేవతి

27 నక్షత్రములు - 12 రాశుల సంబంధము:

  1. అశ్విని భరణి కృత్తికాః పాదం - మేషం
  2. కృత్తికాత్రిపాదం రోహిణి మృగశిరార్థం - వృషభం
  3. మృగశిరార్థం ఆర్ర్ద పునర్వసూస్త్రయోః - మిథునం 
  4. పునర్వసూపాదం పుష్యమి ఆశ్లేషాంత్యం - కర్కాటకం
  5. మఖ పుబ్బ ఉత్తరాపాదం -సింహం
  6. ఉత్తరాత్రిపాదం హస్త చిత్తార్థం - కన్య
  7. చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయః - తుల
  8. విశాఖాపాదం అనూరాధ జేష్ఠాంత్యం - వృశ్చికం
  9. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢాః పాదం - ధనస్సు
  10. ఉత్తరాషాఢాత్రిపాదం శ్రవణ ధనిష్ఠార్థం - మకరం
  11. ధనిష్ఠార్థం శతభిష పూర్వాభాద్రాస్త్రయః - కుంభః
  12. పూర్వాభాద్రా పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం
అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము - 9 పాదములు అనగా 1 రాశి. ఇటులనే 12 రాశులకు 108 పాదములు.

9 నక్షత్రములు - 36 పాదములు - 4 రాశులు - 1 నవకం

తిథులు:
1.పాడ్యమి8.అష్టమి
2.విదియ9.నవమి
3.తదియ10.దశమి
4.చవితి11.ఏకాదశి
5.పంచమి12.ద్వాదశి
6.షష్ఠి13.త్రయోదశి
7.సప్తమి14.చతుర్దశి
శుక్ల పక్షంలో పౌర్ణమి లేక కృష్ణ పక్షంలో అమావాస్య

వారాలు:
1.ఆదివారము
2.సోమవారము
3.మంగళవారము
4.బుధవారము
5.గురువారము
6.శుక్రవారము
7.శనివారము

No comments:

Post a Comment