శ్రీ రామచంద్రమూర్తి జన్మించిన రోజున మనము శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటున్నాము. అదే విధంగ సీతారాముల కళ్యాణం కూడా ఆరోజే. శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి దిగ్విజయంగ అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడ ఈరోజే. మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీ రామపట్టాభిషేకము జరిగినది. ఇది ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు. ఈ రోజున ధనశక్తికొలది ప్రతివారూ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహమును కానీ శ్రీరామ పట్టాభిషేక పటమును కాని పెట్టి పూజించాలి.
పూజా విధానము :-
ఫూజా మందిరంలో రాముని ప్రతిమను పెట్టి అలంకరించి షొడషోపచారములు చేసి పానకము, వడప్పప్పు, మజ్జిగ నైవేద్యమిచ్చి కర్పూర హారతినీయవలెను. తర్వాత ఒక బ్రాహ్మణుడిని శ్రీ రాముడిగ భావించి విసనకర్ర, పానకం, వడప్పప్పు, మజ్జిగ ఇచ్చి అతని అశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకొనవలెను.

నైవేద్యం:
వడపప్పు :-
పెసరపప్పుని నీటిలొ నానబెట్టి పెసరపప్పు బాగా నానాక నీటిని వంపేయాలి.
పానకం :-
నీటిలో బెల్లం వేసి కలపాలి. దానికి యాలుకల పొడి చేర్చాలి.
మజ్జిగ :-
పెరుగును చిలికి ఉప్పు వేసి కరివేపాకు,కొత్తిమీరతొ తిరువాత వేయాలి.
పెరుగును చిలికి ఉప్పు వేసి కరివేపాకు,కొత్తిమీరతొ తిరువాత వేయాలి.
No comments:
Post a Comment