Friday, August 23, 2013

శ్రీ భాస్కరాష్టకమ్

శ్రీ పద్మినీశం మరుణోజ్వల కాంతి మంతం |
మౌనీంద్ర బృంద సుర వన్దిత పాద పద్మమ్ ||
నీరేజ సంభవ ముకున్ద శివ స్వరూపమ్ |
శ్రీ భాస్కరం భువన బాందవ మాశ్రయామి ||

మార్తాన్డ మీశమఖిలాత్మక మంశు మంతమ్ |
ఆనంద రూప మణి మాదిక సిద్ది దంచ ||
ఆద్యంత మధ్య రహితంచ శివ ప్రదంత్వాం |
శ్రీ భాస్కరం నత జనాశ్రయ మాశ్రమామి ||

సప్తాశ్వ మభ్రమణి మాశ్రిత పారిజాతమ్ |
జాంబూన దాభ మతి నిర్మల దృష్టి దంచ ||
దివ్యంబరాభారణ భూషిత చారు మూర్తిమ్ |
శ్రీ భాస్కరం గ్రహగనాది పతిమాశ్రయామి ||

పాపార్తి రోగ భయ ధు:ఖ హరం శరణ్యమ్ |
సంసార గాఢ తమ సాగర తారకాంచ ||
హంసాత్మకం నిగమ వేద్య మహాశక రంత్వామ్ |
శ్రీ భాస్కరం కమల భాందవ మాశ్రయామి ||

ప్రత్యక్ష దైవం మాచలాత్మక మచ్యుతంచ |
భక్తి ప్రియం సకల సాక్షిణ మప్రమేయమ్ ||
సర్వాత్మకం సకల రోగ హరం ప్రసన్నం |
శ్రీ భాస్కరం జగదదీశ్వర మాశ్రయామి ||

జ్యోతి స్వరూప మఘ సంచయ నాశకంచ |
తాపత్రయాన్తక మనంత శుభ ప్రదంచ ||
కాలాత్మకం గ్రహ గణేన సుసేవితంచ |
శ్రీ భాస్కరం భువన రక్షక మాశ్రయామి ||

సృష్టి స్థితి ప్రళయ కారణ మీశ్వరంచ |
దృష్టి ప్రదం పరమ తుష్టిద మాశ్రిత్రానాం ||
ఇష్టార్దధం సకల కష్ట నివారకంచ |
శ్రీ భాస్కరం మృగ పతీశ్వర మాశ్రయామి ||

ఆదిత్య మార్త జన రక్షక మవ్యయంచ |
చాయాధవం కనక రేత సమగ్ని గర్భమ్ ||
సూర్యం కృపాళు మఖిలాశ్రయ యాదిదేవమ్ |
లక్ష్మీనృసింహ కవి పాలక మాశ్రయామి ||

శ్రీ భాస్కరాష్టక మిదం పరమం పవిత్రమ్ |
యత్ర శ్రుతం పఠితం సతతం స్మృతంచ ||
తత్ర స్థిరాణి కమలాప్త కృపా విలాసై |
దీర్ఘాయురర్ధ బల వీర్య సుతాది కాని ||

Thursday, August 22, 2013

శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమాన్ అంజనాసూనుహు వాయుపుత్రో మహా బలహ |
రామేస్ట ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః |
ఉదధిక్రమణేశ్చైవ సీతాశోక వినాశకః |
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా |
ద్వాదశైనాని నామాని కపీంద్రశ్చ మహాత్మనః |
ప్రాతః కాలే పఠెత్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్య మృత్యు భయంనాస్తి సర్వత్ర విజయీభవేత్ ||

Saturday, August 10, 2013

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నిత్య పూజ

పూజా విధానం:
గణపతి ధ్యానం:
శ్లో||శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||

శ్లో||ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
(అని ఘంటవాయించాలి)

ఆచమనం:
(పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషికేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
      ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము:
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం:
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ...ఆయనే, .....ఋతౌ, .....మాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతా ముద్దిస్య | శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం ధానా వాహనాది శోడశోపచార పూజాం కరిష్యే|
అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.

గణపతి పూజ:
శ్లో||వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

కలశ పూజ:
(కలశమునకు మూడువైపుల గంధము పెట్టి, కుంకుమ పెట్టి కలశం నీటిలో అక్షతలు, గంధము, పుష్పము ఉంచి చేతితో మూసి ఈ క్రింది శ్లోకములతో అభిమంత్రణ చేయవలయును)
కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చః |
కలశోపరి హస్తంనిధాయ ||
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా |
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ||
సర్వేసముద్రాః సరితః తీర్థాని చ హ్రదాః నదాః |
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశోదకము పుష్పముతో దేవునిపైన, తమపైన  పూజద్రవ్యములపైన, తన మీద చల్లవలెను)

ప్రాణప్రతిష్ట:
(నీటిని చల్లుతూ క్రింది మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం ప్రాణస్య శివః ప్రాణేశ స్వాహ ||

ధ్యానం:
శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం |
రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||
షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ||
కుమారేశసూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తి హారిన్ ప్రభో తారకారే సదారక్షమాంత్వం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి

ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి

రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)

పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)

శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)

వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి
(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)

అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షంతలు చల్లాలి)

ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి
(పూలు, అక్షంతలు చల్లాలి)

పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
(పూలు వేయాలి)

అథాంగ పూజ:
ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
ఓం తారకారి నమః కంఠం పూజయామి
ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ పూజ
(ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)

శ్రీ సుబ్రమణ్య స్తోత్రం

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపం సమర్పయామి
(అగరవత్తులు వెలిగించండి)

దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి
(దీపం చూపించాలి)

నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)

తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం చూపాలి)

నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి
(కర్పూరం వెలిగించాలి)

మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం:
(చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి

పునః పూజ:
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః చామరం వీజయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నృత్యం దర్శయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గీతం శ్రావయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గజాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆందోళికాం ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక |
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.

Friday, August 9, 2013

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి

ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశప్రభంజనాయ నమః
ఓం తారకాసురసంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్యస్సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః 
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం శివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహూతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః
ఓం వటవేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం కృపాకపయే నమః
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామకంధరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఆన్ గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళి సంపూర్ణం

Thursday, August 8, 2013

మంగళగౌరీ వ్రతము

పూజా ద్రవ్యాలు:
పసుపు
కుంకుమ
పండ్లు
పూలు
తమలపాకులు
వక్కలు
అగరబత్తులు
కర్పూరం
గంధం
అక్షతలు
కొబ్బరికాయ
వస్త్రము(పత్తితో చేయునది)
నేతి దీపము
నూనె
కత్తి
నైవేద్యం : పిండి వంటలు

పసుపుతో రెండు కొమ్ములతో గౌరి దేవిని ఒక కొమ్ముతో వినాకుడుడిని చెసి తమలపాకుల మీద ఉంచి తాంబూలం పెట్టాలి.

దారం 5 వరసలు తీసుకుని 5 గ్రంధులతో 5 తోరాలు తయారు చేసుకోవాలి.
1 అమ్మవారికి రెండోది పూజచేయువారికి ం
ఊడోది తమలపాకు తో కత్తికి కట్టటానికి మిగిలినవి వాయనం ఇచ్చె ముత్తైదువులకు.

వ్రత నియమం:
ఈ వ్రతం కొత్తగా పెళ్ళైన వారు ఐదు సంవత్సరములు శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు చేయాలి. ఐదుసంవత్సరాలు అయ్యాక కొత్తగా పేళ్ళైన అమ్మాయికి ఇవ్వాలి.


మొదటి సంవత్సరములో వచ్చే తొలి మంగళవారము పుట్టింట్లో చేసుకోవాలి.

పూజ విధానము:
ఆచమనం:  (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
    ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి

సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, మంగళవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, మమ యావజ్జీవ సౌమంగల్య సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలసిద్ధ్యర్థం సర్వమంగళాగౌరీ దేవతా ముద్దిశ్య మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం మంగళగౌరీ వ్రత మహం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.

శ్లో|| ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
అని ఘంటవాయించి కలశమునకు మూదువైపుల గంధము పెట్టి, కుంకుమ పెట్టి కలశం నీటిలో అక్షతలు, గంధము, పుష్పము ఉంచి చేతితో మూసి ఈ క్రింది శ్లోకములతో అభిమంత్రణ చేయవలయును.

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోని కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||

మాతః సర్వ జగన్నాధే యావత్పూజావసానకం |
తావత్త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ||
అవాహితాభవ స్థాపితా భవ సుప్రసన్నభవ వరదాభవ మమ ఇష్టకామ్యార్థ సిద్దిదా భవ

అత్రాగచ్చ మహాదేవి సర్వలోక సుఖప్రదే |
యావద్ర్వత మహంకుర్వే పుత్త్ర పౌత్రాభి వృద్ధయే ||
సర్వమంగళాయై నమః ఆవాహయామి

బాలాంనవోఢాం సంపూజ్యాం మంగళద్రవ్య వాసినీం |
సర్వాలంకార సంపూర్ణాం భావయే త్సర్వమంగళాం ||
మంగళగౌర్యై నమః ధ్యానం సమర్పయామి

రౌప్యేణ చాసనం దివ్య రత్న మాణిక్య శోభితం |
మయానీతం గ్ర్హాణ త్వం గౌరి కామారి వల్లభే ||
ఆసనం సమర్పయామి

గంధపుష్పాక్షతైర్యుక్తం పాద్యం సంపాదితం మయా |
త్వంగృహాణ దయాసింధో గౌరి మంగళ దేవతే ||
పాదయః పాద్యం సమర్పయామి

సర్వలోక ప్రియేదేవి శంకరప్రియభామిని |
గృహాణార్ఘ్యం మయాదత్తం సౌభాగ్యం దేహి సర్వదా ||
అర్ఘ్యం సమర్పయామి

కామారి వల్లభేదేవి  కుర్వాచమనమంబికే |
నిరంతర మహం వందే చరణౌ తవపార్వతి ||
ఆచమనీయం సమర్పయామి

పయోదధిఘృతం చైవ మధుశర్కరయా సమం |
పంచామృతేన స్నపనం కారయే త్వాం శివప్రియే ||
పంచామృతైః స్నపయామి

గంగాజలం సమానీతం శుభం కర్పూర సంయుతం |
స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్త్రాది ఫలప్రదాం ||
శుద్ధోదక స్నానం సమర్పయామి

వస్త్రంచ సోమ దైవత్యం లజ్జాయాస్తు నివారణం |
మయా సమర్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి ||
వస్త్రయుగ్మం సమర్పయామి

కుంకుమాగరు కర్పూర కస్తూరీ చందనాదికం |
విలేపనం మహాదేవి గంధం స్వీకురు శాంకరి ||
గంధం ధారయామి

రంజితాం కుంకుమౌఘేన హరిద్రాక్తా స్తథాక్షతాః |
తవతలంకరణార్థాయ ప్రదత్తా స్సర్వ మంగళే ||
అక్షతాన్ సమర్పయామి

హరిద్రాం కుంకుమంచైవ సింధూరం కజ్జలాన్వితం |
నీలలోహిత తాటంకే మంగళద్రవ్య మీశ్వరి ||
హరిద్రాకుంకుమాది సౌభాగ్య ద్రవ్యాణి సమర్పయామి

చంపకాకుంద మందార పున్నాగ బృహతీయుతైః |
పుష్పైర్బిల్వదళోపేతైః పూజయామి సివప్రియే ||

అథాంగ పూజ:
ఉమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జంఘే పూజయామి
పార్వత్యై నమః జానునీ పూజయామి
జగన్మాత్రే నమః ఊరూ పూజయామి
జగత్ర్పతిష్ఠాయై నమః కటిం పూజయామి
మూల ప్రకృతయే నమః నాభిం పూజయామి
అంబికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి
శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
బ్రహ్మవిద్యాయై నమః జిహ్వాం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రౌ పూజయామి
రుద్రాయై నమః కర్ణౌ పూజయామి
సర్వ మంగళాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళగౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ లలితాష్టోత్తర శతనామావళి(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

సర్వమంగళా మంగళ గౌర్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పైః పూజయామి

దేవదారు రసోద్భూతః కృష్ణాగరు సమన్వితః |
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ||
ధూపమాఘ్రాపయామి

త్వంజ్యోతి స్సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తమం |
జ్యోతిర్మండలగే దేవి దీపం స్వీకురు శాంకరి ||
దీపం దర్శయామి

అన్నం చతుర్విధంస్వాదుర సైష్షడ్భి స్స్మన్వితం |
గృహాణ భక్ష్య భోజ్యాఢ్యం సుమృష్ణం సర్వమంగళే ||
నైవేద్యం సమర్పయామి

వూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళాన్వితం |
కర్పూరైలా సుధాయుక్తం తాంబూలం శివసుందరి ||
తాంబూలం స్మర్పయామి

సౌవర్ణీ దక్షిణా ప్రోక్తా పూజా సాఫల్య కారణం |
దక్షిణాం ప్రతిహృహ్ణీష్వ దక్షిణే సర్వమంగళే ||
దక్షిణాం సమర్పయామి

వాణీ లక్ష్మీ శచీ మౌళీ నీరాజిత పదాం బుజే |
శివే నీరాజయామి త్వాం నిత్య లోక ప్రకాశికాం ||
కర్పూర నీరాజనం దర్శయామి

శివాంక వాసినీ మంబాం సర్వే దేవా మహర్షయః |
ప్రదక్షిణేన పశ్యంతి తేన కుర్యాం ప్రదక్షిణం ||
ఇం నమశ్శివకాంతాయై హ్రీం నమశ్శివశక్తయే |
శ్రీంనమో జగతాం మాత్రే మమ భూయాన్మనోరథః ||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

పుత్రాం దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే |
సౌమంగల్యం సుఖం జ్ఞానం దేహిమే శివసుందరి ||
ఛత్ర చామరాందోలనాది సర్వోపచార పూజా పరికల్పయామి

అనేన మంగళగౌరీ వ్రతేన సర్వమంగళ మంగళగౌరీ సుప్రీత సుప్రసన్న వరదా భవతు
బ్రాహ్మణునికి, ముత్తైదువకు, తల్లికి వాయనం ఇవ్వవలెను
అన్ని శ్రావణమాసంలో మంగళవారాలు ఐదు పోగులు, ఐదు ముడులు ఉన్న తొరమును పూజలో పెట్టి పూజైన తరువాత ధరించవలెను. బియ్యంపిండి, బెల్లం కలిపి ప్రమిదలు ఐదు చేసి జ్యోతులు వెలిగించి తమలపాకు కట్టిన చాకుతో దీపాన్ని తాకుతూ కథ చదవాలి. కథ ముగిన తరువాత చాకుపై ఉన్న కాటికను ముత్తైదువులకు ఇచ్చి వ్రతం చేసిన వారు ధరించాలి.

మంగళగౌరీ వ్రత కథ:

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణామూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.

ఒకప్పుడు సూత మహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. పసువు, కుంకుమ, పూలు, సగుంధాది మంగళద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ మంగళగౌరీ కొలువై ఉంటుంది.

త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన 'మండూడనే రాజు గౌరీ దేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజూమేలాడు. అటువంటి గౌరీ దేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను.

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము.

చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి "భవతీ భిక్షాందేహి" అన్నాడు. జయపాలుని భార్య బంగారు పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది, జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక మీకు సంతానము లేని కారణంగా నీచేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య, "అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి" అని వేడుకోగా ఆ సన్యాసి రూపములో ఉన్న ఈశ్వరుడు "అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీ కోరిక నెరవేరుతుంది.

"నీ భర్తను నీల వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను, ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయం లో ఉండే అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు. స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు సాక్షాత్కరించి ఎం కావాలో కోరుకోమంటే తనకు సంతానం కావలెనని కోరాడు. అప్పుడు అమ్మవారు "వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని" అడిగింది. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి తన పక్కన ఉన్న గణపతి దగ్గరనున్న మామిదిచెట్టు మీది ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసాడు. కాని అన్ని మాయమయి ఒక్కటే మిగిలినది. గణపతికి అలాకోసేసరికి కోపము వచ్చి ఈ చర్య వల్ల నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపించాడు.

ఈ వింధంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. అతనికి శివుడని నామకరణము చేసిరి. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్తతో అన్నది. కాశీవిశ్వేశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్ఠానపురం చేరారు.

అక్కడ కొందరు కన్యలు పూలుకోసుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను "ముండ,రండ" అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల "మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది" కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు  ఉండరు అంది కోపంతో అంత వరకూ కోసిన పూలను నేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదికి చేరిపోయాయి.

జయపాలుడు కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. "మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరీవ్రతం చేస్తుంటుంది" అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోచింది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా సుశీల తల్లిదండ్రుల దగ్గరకి వెళ్ళి నీకూతురుకి తగిన భర్త అని శివుని చూపగా వారు ఆ పరమశివుడే శివుని పంపాడని వారిరువురికి వివాహం జరిపిస్తారు. వారి పెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి మంగళగౌరీ నోము ఉద్యాపన చేస్తుంది.

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి "నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో ఆతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెపుతాను విను అని ఈవిధంగా చెప్పెను, "కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది" అని అంతర్ధానమయ్యెను.

శుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్దికోసం బయలుదేరారన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు, భార్యకు ఏ వివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.

ఉంగరం వదలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగ అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిధులకు రోజూ కాళ్ళు కడుగుతుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటునట్లూ కల వచ్చింది. వళ్ళు మరలా ప్రతిష్ఠానపురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు.

సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవక్ర్పవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకిలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.

పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకొని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది శుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. శుశీల మంగళ గౌరీ నోములో నోచిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు.ఇందన్నడు  అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుషు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.

దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుదు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయిష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్య చేసిన పుణ్య కార్యాల వల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.

ఓ ద్రౌపదీ! మంగళ గౌరీ వ్రత ప్రసాదముతో వైధవ్యం లేకుందా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

గౌరమ్మ పాట:

కోటలేడు చుట్లు కొమరప్ప పట్నాన, మేటైన ఈ ఊరి మేడలిండ్లు
వాడవనితలెల్ల వచ్చి మిమ్ము కొలిచెదరు, వేడుకతో ఈశ్వర్ల గౌరమ్మను ||
|| జయ మంగళం నిత్య శుభ మంగళం ||
వాటమీగ పాదాలు వన్నెలొత్తగా పట్టి, పాటించి మెడిమలకు పసుపు పూసి
పొందుగా మాఇంటి పగిడి గద్దెమీద, ప్రత్యక్షమాయనే భాగ్య గౌరీ ||జయ||
ఏ ఇల్లు మంచిదో ఏ వాడ మంచిదో, ఏ నగరు మంచిదో అనుచు వచ్చి
నాన్యమైయున్నది నాకు ఈ నగరం అనుచు నట్టింట వెలసెనే ఆది గౌరి ||జయ||
కూటమూ న్నాలుగు మూలలా మహాలక్ష్మి, నవ్వుచు నాటకపు శాలలోను
ఆటకూటములున్న నాటకపు శాఅలలోన, నగరపుటిండ్లలో వెలిసెనే భాగ్యగౌరు ||జయ||
చీకటివనములో శ్రీమహాలక్ష్మివో మామిడివనములో మహాలక్ష్మివో
వసంతలక్ష్మివో వనజాయతాక్షివో శ్రీక్రిష్ణపట్నాన శ్రీమహాలక్ష్మివో ||జయ||
నిర్మలాలాక్షితో నీడలోలక్ష్మివో పొన్నలోఉండే నిజలక్ష్మివో
కాంతమున ఈ ఊరి ఘనపాటలక్ష్మివో ఘనల అన్నల ఘనల లక్ష్మివో ||జయ||
పచ్చ పసుపొక కాంతి బంగారమొక కాంతి అచ్చమాణిక్యాల ఆరకాంతి
దవళాయ నాసిక బరణమొక్కటికాంతి ఈశ్వర్ల గౌరమ్మ తానే కాంతి ||జయ||
చెట్టుచెట్టుకు పోయి చేమంతులు కోసి సృష్టికర్త అయిన శ్రీగౌరీ దేవి
శంభుడు ఈశ్వరుడు శాంబవతీ గౌరమ్మ చెండ్లాడుతూ వచ్చి చేరి నిలిచిరి ||జయ||
అవతల కావేరి ఇవతల కొల్లాడం నడుమనే శ్రీరంగనాథపురం
నాధుడు రంగనాయకుల పాలి అర్థాంగివై నాంచారికొసగితివే భాగ్యగౌరి ||జయ||
తెల్లచీరా కట్టి తెల్ల రవికా తొడిగి తెల్ల నాకుల కట్ట చేతబట్టి
తేజముగ మనకిపుడు సంపదిస్తామంటూ తెల్లవారింటికి వచ్చె గౌరు ||జయ||
కావి చీరా కట్టి కావి రవికా తొడిగి కన్నులకు సన్నంపు కాటుకీడి
కాంతరో మనకిప్పుడు సంపదిస్తామంటూ నడువెండలుండంగా వచ్చె గౌరు ||జయ||
పచ్చ చీరా కట్టి పచ్చ రవికా తొడిగి పచ్చనాకుల కట్ట చేతబట్టి
పడతిరో మనకిప్పుడు సంపదిస్తామంటూ పట్టపగలింటికి వచ్చె గౌరు ||జయ||
నీలి చీర కట్టి నీలి రవికా తొడిగి నిలువెల్ల బంగారు కొమ్ము పెట్టి
నెలతరో మనకిప్పుడు సంపదిస్తామంటూ నీరెండ నుండంగా వచ్చె గౌరు ||జయ||
నిత్య శుక్రవారమ్మ మన ఇంటిలో విందు అటుమీద శ్రీ వెంకటాద్రి విందు
గౌరీ పుత్రుల విందు గణనాయకుల విందు గౌరమ్మ మన ఇంట నిత్య విందు ||జయ||
అత్తలకు కోడళ్ళకు కావొదినా మరదళ్ళకు హెచ్చైన యారాండ్లకు పొత్తు
మాడుందురట పోరాటము లేక నిత్య మహలక్ష్మి నీవున్న చోట ||జయ||
నీవున్న చోట నీతుడై హరి ఉండు హరి ఉన్న చోటనే ధర్మముండు
ధర్మమున్న చోట జయము కలిగి ఉండు జయమున్న చోటనే సకలముండు ||జయ||
మహారాజ రామన్న మంత్రి లక్ష్మన్న తమ్ముదు భరతన్న శత్రుఘ్నులకును 
దయగల సీతకు దేవి ఊర్మిళకును చెల్లెలు మాండవతికి శ్రుతకీర్తికి ||జయ||
బొక్కసపు పెట్టెలకు భువనేశ్వరమ్ములకు బొమ్మల పల్లకులకు
ఆయుధములకు పెక్కు నవరత్నాల పెట్టెలకు కడపల కస్తూరి జువ్వాది కలశములకు ||జయ||
చుక్క బొట్టు కాటుక ఉల్లిపూసల దండ ఎక్కువైన వజ ఉల్లిపేర
జక్కినీల చేత ముక్కించుకొన్నట్టి చక్కని తల్లులకు పేరాండ్రాండ్రు
లకు ||జయ||
కొడుకులు కోడళ్ళు కుమార్తే అల్లుళ్ళు తగు మనుమలు మనుమరాళ్ళు
ఇంత ఒప్పటి వరము మా అత్త మామలకు ఇష్ట సంపదలిచ్చే గౌరు ||జయ||
నట్టింట అద్దము నాగ బందనపు తీగ పరుపు మీద పది నెలలు పాపడాడు
ఇంత ఒప్పటి వరము అక్క బావగార్లకు ఇష్టసంపదలిచ్చె గౌరు ||జయ||
ఆచంకనొక బిడ్డ ఈచంకనొక బిడ్డ కడుపులో ఒక బిడ్డ కదలాడగా
ఇంత ఒప్పటి వరము మా అన్నావదినలకు ఇష్టసంపదలు వరమిచ్చె గౌరు ||జయ||
శివునిపూజించినాడు శివుని ప్రార్థించినాడు శివుని మీదనే భక్తి నుంచినాడు పండ్రెండు రుద్రాభిషేకములు చెసినాడు పరమాత్ముని వంటి మా నాయనకు ఇష్టసంపదలు వరమిచ్చె గౌరు ||జయ||
అన్నదానము చేసి వస్త్రదానము చేసి ఆ మగనికి ఆ స్త్రీ అనుకూలము 
నిత్య గౌరీ పూజ తప్పకుండ చేయు సత్యవంతురాలు మా అమ్మకు ||జయ||
చిట్టి చిట్టి బొమ్మలు శ్రీ తొరణంబులు చిన్ని మా అమ్మాయి పెండ్లెన్నడు
మాఘమాసము నాదు మంచి ముహూర్తము నాడు పసిడి పంచమి నాడు పడతి పెండ్లి ||జయ||
పప్పునూ పెట్టరే పాయసం పెట్టరే అప్పచ్చులు వేయరే నెయ్యి వెయ్యరే
ఎప్పుడూ పెట్టరే ఏక చిత్తమున పాయక మా బాబుకు పాలు బువ్వ ||జయ||
శాంకరీ జగదాంబ జయ నిత్య కళ్యాణి పంకజాసన ముఖీ పావనాంగీ
కాంత శిరోమనికి కనక కుసుమములతో మంత్ర పుష్పములు పెడుతూ మహాలక్ష్మికి ||జయ||
ముత్యాల హారతి పగడాల హారతి మాణిక్యాల హారతి మగువ నీకు
ముత్తైదుతనమిచ్చె ముదముతో రక్షించు ఎత్తుకొమ్మని శిరస్సును ఎత్తుకొనిరి ||జయ||
పచ్చలా హారతి పగడాల హారతి మాణిక్యాల హారతి మగువ నీకు
అనంత కాలమ్ము ఐదవతనమిచ్చి దీపాల పల్లెరాలు దించుకొనిరి దించుకోంగా చూచి దృష్టాంతమాయనే భాగ్యలక్ష్మి ||జయ||
పూజింప మావంతు పూజగొన మీవంతు రాజసము మీవంతు రాజనావళి
అష్టైశ్వర్యములు అడిగేది మావంతు ఐదవతనమిచ్చేది మీ వంతు ||జయ||

వ్రత ఉద్యాపన:


ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరం ప్రారంభించి ఐదు సంవత్సరములు చేయాలి. ఐదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళవారం మంగళగౌరిని యధావిధిగా పూజించాలి తరువాత ఒక పెళ్ళిలో పెళ్ళికూతురికి కొత్త వస్త్రాలు ఇచ్చి మెట్టెలు, మంగళసూత్రం కలిపి వాయనం ఇవ్వాలి. ఆ విధంగా మంగళగౌరీ ఉద్యాపన పూర్తి చేయాలి.

Sunday, August 4, 2013

వైభవలక్ష్మీ వ్రతము

వైభవలక్ష్మీ పూజా వ్రతారంభము

ఆచమనం:  (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
      ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము:
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం:
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ...ఆయనే, .....ఋతౌ, .....మాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వైభవలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వైభవలక్ష్మీవ్రతం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.

శ్లో|| ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
అని ఘంటవాయించి కలశమునకు మూదువైపుల గంధము పెట్టి, కుంకుమ పెట్టి కలశం నీటిలో అక్షతలు, గంధము, పుష్పము ఉంచి చేతితో మూసి ఈ క్రింది శ్లోకములతో అభిమంత్రణ చేయవలయును.

కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చః |
కలశోపరి హస్తంనిధాయ ||
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా |
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ||
సర్వేసముద్రాః సరితః తీర్థాని చ హ్రదాః నదాః |
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశోదకము పుష్పముతో దేవునిపైన, తమపైన  పూజద్రవ్యములపైన చల్లి పిదప పసుపుతో చేసిన గణపతిపై పుష్పమునుంచి ఈ విధముగ గణపతి పంచోపచార పూజ జరుపవలెను)

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీమహాగణపతయే నమః ధ్యాయామి (పుష్పము ఉంచవలెను)
శ్రీమహాగణపతయే నమః గంధం సమర్పయామి
(గంధము పుష్పములతో అద్ది ఉంచవలయును)
శ్రీమహాగణపతయే నమః పుష్పం సమర్పయామి(పుష్పం ఉంచవవలయును)
శ్రీమహాగణపతయే నమః ధూపం సమర్పయామి(అగరబత్తి వెలిగించవలయును)
శ్రీమహాగణపతయే నమః దీపం సమర్పయామి(దీపం చూపవలయును)
శ్రీమహాగణపతయే నమః గుదోపహారం సమర్పయామి(బెల్లం ముక్క ఉంచి నైవేద్యం చేయవలెను)
శ్రీమహాగణపతయే నమః తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి(తాంబూలము ఉంచి అక్షతలు ఉంచి నమస్కరించవలెను)
శ్రీమహాగణపతి ప్రసాదం సిరసాగృహ్ణామి(గణపతిని పూజించిన అక్షతలు, పుష్పము శిరస్సున ధరించవలెను)
అనేన గణపతి పంచోపచార పూజయా శ్రీమహాగణపతిః సుప్రీతః సుప్రసన్నో వరదోభవతు
(అని నీటిని వదిలిపెట్టి వైభవలక్ష్మీదేవి కలశం దగ్గర యంత్రము, పటము ఉంచి దానికి నమస్కారము చేయుచు పూజ ప్రారంభించవలయును. పుష్పము తీసుకొని)
ఆగచ్చ దేవదేవేశీ సర్వైఃదేవా గణైస్సహ |
యత్వాం పూజయిష్యామి తావత్వం సుస్థిరోభవ ||
అస్మిన్ కలశే ప్రతిమాయాంచ శ్రీవైభవలక్ష్మీ సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పరివార సమేతాం శ్రీ వైభవలక్ష్మి మావాహయామి. శ్రీవైభవలక్ష్మీ ఆవాహితోభవ సంస్థాపితోభవ, సన్నిహితోభవ, సన్నిరుద్ధోభవ, అకుంఠితోభవ, సుప్రీతోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ, సర్వాభీష్టప్రదోభవ
(అని ప్రార్థించి అక్షతలు పుష్పము అమ్మవారి ముందు ఉంచవలయును)

శ్రీ వైభవలక్ష్మీ ధ్యానం:
శ్రీమద్వైభవలక్ష్మి దేవి వరదే ధ్యాయామి త్వాం సర్వదా భక్తాభీష్ట వరప్రదాననిరతే కౌసుంభవస్త్రాన్వితే పద్మాక్షీం వరపద్మశోభిత కరౌ పద్మాసనస్థాం శుభాం శ్రీదేవీం ప్రణతోస్మి సంతతమహం ప్రారబ్ధదోషాపహం || శ్రీ వైభవలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)

ఆవాహనం:
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ
సర్వమంగళ మాంగళ్యే భక్తాభీష్ట ప్రదాయిని
ఆవాహయామి దేవీత్వం సుప్రీతాభవ సర్వదా
శ్రీవైభవలష్మీ దేవి మావాహయామి స్థాపయామి పూజయామి
(పుష్పము నుంచవలయును)

రత్నసింహాసనం:
తాం మమ ఆవహజాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాంహిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం |
మహాలక్ష్మీ మహాదేవి పూర్ణచంద్ర నిభాననే
సింహాసనమిదందేవి గృహణ సురవందితే ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి.
(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం
శ్రియందేవీ ముపాహ్వాయే శ్రీర్మాదేవీ జుషతాం |
సూర్యాయుతనిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితే
పాద్యం గృహాణ దేవేశీ సర్వకళ్యాణకారిణీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్థ్రాం జ్వలంతీం తృప్తాం
తర్పయంతీ పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వాయే శ్రియం |
సువాసిత జలంరమ్యం కస్తూరీ పంకమిశ్రితం
గంధపుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం దాస్యామి సుందరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
చంద్రప్రభాసాం యశసాజ్జ్వలంతీం
శ్రియంలోకే దేవ జుష్టాముదారాం |
తాంపద్మినీం శరణ మహం ప్రపద్యే
ఆలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ||
సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం సురేశ్వరీ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)

శుద్ధోదకస్నానం:
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవవృక్షోధబిల్వః
తస్యస్ఫలాని తపసానుదంతు మాయంతరాయశ్చ బాహ్యామలక్ష్మీః
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరీ
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(స్నానము చేయించునట్టి నీటిని పుష్పముతో చల్లవలయును)

పంచామృతం:
మధ్వాజ్య దధిసంయుక్తం శర్కరాక్షీరసంయుతం
పంచామృతస్నానమిదం గృహాణ పరమేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః పంచామృతస్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)
పంచామృత స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః స్నానాంతరం శుద్ధాచమనం సమర్పయామి
(మరల నీటిని చల్లవలెను)

వస్త్రం:
ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణివాసహా
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే ||
సురార్చి తాంఘ్రి యుగళే దుకూలవసన ప్రియే
వస్త్రయుగ్మం ప్రసాస్యామి గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

రక్తసంచుకం:
క్షుత్పిసాపామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణ్యుదమేహ్ గృహాత్ ||
సర్వతంతు సముధ్భూతం రక్తవర్ణేనశోభితం
భక్త్యా దత్తం మయాదేవి కంచుకం పరిగృహ్యతాం ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః రక్తకంచుకం సమర్పయామి
(ఎర్రని రవికలగుడ్డ సమర్పించవలెను)

ఆభరణం:
కేయూరకంకణే హారనూపుర మేఖలాః
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః సమస్త దివ్యాభరణాని సమర్పయామి

గంధం:
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాఙ్కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపాహ్యయేశ్రియం ||
కర్పూరాగరు కస్తూరీ రోచనాది సుసంయుతం
అష్టగంధం ప్రసాస్యామి స్వీకురుష్వ శుభప్రదే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనంధం సమర్పయామి
గంధము పుష్పములో అద్ది అమ్మవారికి సమర్పించవలెను

కీరిటకం:
మనసః కామమాకుతిం వాచస్పత్యమశీమహి
పశునాగం రూపమన్యస్య మయి శ్రీశ్రియతాం యశః
విశ్వపత్నీ విశ్వరాజీ లయస్థిత్యుద్భవేశ్వరీ
సువర్ణా నక్షతాన్ దేవీ గృహాణకరుణాకరి
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః కిరీటం సమర్పయామి

అక్షతాన్:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులన్ శుభాన్
హరిద్రా కుకుమోపేతాన్ గృహ్యతా మద్భి పుత్రికే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః అక్షతాన్ సమర్పయామి

మంగళసూత్రం:
శుద్ధ స్వర్ణకృతందేవి మాంగళ్యం మంగళప్రదం
సర్వమంగళ మాంగళ్యం గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యై మంగళసూత్రం మంగళద్రవ్యాణి సమర్పయామి
మంగళసూత్రము లేదా పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించవలెను

పుష్పము:
కర్దమేన ప్రజాభూతా మయిసంభవ కర్దమ
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీం ||
మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైరపి
శతపత్రైశ్చ కళారై2హ్ పూజయామి వరప్రదే ||
శ్రీవైభవలక్ష్మ్యై నమః పుష్పాణి సమర్పయామి.

అథాంగ పూజ:
ఓం ఆదిలక్ష్మ్యై నమః పాదౌ పూజయామి
ఓం ధాన్యలక్ష్మ్యై నమః గుల్ఫౌ పూజయామి
ఓం ధైర్యలక్ష్మ్యై నమః జానునీ పూజయామి
ఓం గజలక్ష్మ్యై నమః ఊరూ పూజయామి
ఓం సంతానలక్ష్మ్యై నమః కటిం పూజయామి
ఓం విజయలక్ష్మ్యై నమః నాభిం పూజయామి
ఓం విద్యాలక్ష్మ్యై నమః హృదయం పూజయామి
ఓం ధనలక్ష్మ్యై నమః స్తనౌ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః వక్షః పూజయామి
ఓం చంచలాయై నమః బాహూన్ పూజయామి
ఓం వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
ఓం రమాయై నమః ముఖం పూజయామి
ఓం కమలాలయై నమః నేత్రౌ పూజయామి
ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
ఓం వైభవలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి


సౌభాగ్యలక్ష్మీ రావమ్మా!

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...అమ్మా...సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ||
నుదుటకుంకుమ రవి బింబముగ కన్నుల నిండుగ కాటుకవెలుగ
కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండుగ ||సౌభాగ్య||
నిండు కరముల బంగరుగాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడిజేయగ సౌభాగ్యవంతుల సేవలనందగ ||సౌభాగ్య||
నిత్యసుమంగళి నిత్యకళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణనిండుగా కనకవృష్టి కురిపించే తల్లి ||సౌభాగ్య||
జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై
సాధుసజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవెనలీయగ ||సౌభాగ్య||
కుంకుమ శోభిత పంకజ లోచని వేంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ శౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ||సౌభాగ్య||
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విఠలుని పట్టపురాణి
శుక్రవారము పూజలనందగ సాయంకాలము శుభ ఘడియలలో ||సౌభాగ్య||

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ(ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)

ధూపం:
అపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమేగృహే
ణిచదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ||
దశాంగం గగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి దేవేశీ గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ధూపమాఘ్రాపయామి
అగరబత్తిలు వెలిగించి అమ్మవారికి చూపవలెను

దీపం:
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా ||
ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామి వరదే! గృహాణముదితోభవ
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః దీపం దర్శయామి
దీపము వెలిగించి అమ్మవారికి చూపవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
నీరు పుష్పముతో చల్లవలెను

నైవేద్యం:
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా ||
నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్యసంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ విభవేశ్వరీ ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః  నైవేద్యం సమర్పయామి
అమ్మవారికి నైవేద్యము అయిదుమార్లు చేతితో చూపవలెను

తాంబూలం:
తామావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం
హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషావహం ||
వూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
ఏలాలవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః తాంబూలం సమర్పయామి

నీరాజనం:
యశ్శుచిః ప్రయతోభూత్వా జుహుదాజ్యమన్వహం
శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్సతతం జపేత్ ||
నీరాజనం మయానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహాణ హరివల్లభే ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః నీరాజనం సమర్పయామి
హారతి కర్పూరము వెలిగించి అమ్మవారి చుట్టూ మూడుసార్లు తిప్పి హారతి ఇవ్వవలెను
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
నీరాజన పాత్రలో నీళ్లు వదలి కళ్ళకద్దుకోవలయును

మంత్రపుష్పము:
ఆనందకర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయస్తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా
పద్మాసనే పద్మోరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వంమాంభజస్వ పద్మాక్ష్మీ యేనసౌఖ్యం లభామ్యహం ||
అశ్వదాయిచ గోదాయీ ధనదాయి మహాధనే
ధనంమే జుషతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే
పుత్ర పౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాజాతి గోరథం
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కిరోతుమాం ||
చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాంశ్రియమీశ్వరీం
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే
శ్రీదేవీ వరదే మాతః జగదాహ్లాదకారిణీ
మంత్రపుష్పమిదం భక్త్యా అర్పితం స్వీకురుర్ముదా ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
పుష్పము అమ్మవారి వద్ద నుంచవలయును

ఆత్మప్రదక్షణ:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్థన
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
మూడుమార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారము చేయవలయును

వివిధోపచారములు:
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఛత్రం సమర్పయామి
గొడుగు లేదా అక్షతలు వేయవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః చామరం వీజయామి
వింజామర లేదా అక్షతలు వేయవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః దర్పణం దర్శయామి
అద్దము చూపవలయును
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః ఆందోళికాది సరోపచార పూజాం సమర్పయామి
అక్షతలు అమ్మవారికి సమర్పించవలయును

ప్రసాదం:
దేవేశీ భక్తసులభే సర్వాభీష్ట ప్రదాయినీ
త్రాహిమాం సతతందేవీ ప్రసీద వరదోభవ
శ్రియందేహి సుఖందేహి సౌభాగ్యం సంతతింముదా
దేహిమే నిత్యకళ్యాణీ శరణాగత వత్సలే
ఆవాహనం నజానామి పూజనంచయధావిధిః
న జానేదేవి శ్రీదేవి పూజాం స్వీకురు రక్షమాం ||
శ్రీవైభవలక్ష్మీ దేవ్యైనమః మయాకృత యధాశక్తి పూకాఫలం సమర్పయామి
అని అక్షతలు తీసుకొని నీటితో అమ్మవారివద్ద వదలిపెట్టవలయును
శ్రీవైభవలక్ష్మీ ప్రసాదం శిరసాగృహ్ణామి అని అమ్మవారి చెంతనున్న అక్షతలు, కుంకుమ, పుష్పములు తీసుకొనవలయును

వాయనదాన మంత్రము:
ఉద్యాపన సమయములో సువాసినీ స్త్రీలకు దక్షిణ తాంబూలములతో వైభవలక్ష్మీ వ్రత పుస్తకములను ఈ క్రింది శ్లోకము చదివి వాయనముగా సమర్పించవలయును
ఇచ్చువారు
శ్రీదేవీ! లోకకల్యాణీ పద్మాక్షీ సర్వమంగళా
సువాసినీభ్యోదాస్యామీ పుస్తకాని ప్రసీదతు
ఇస్తినమ్మా వాయనం
పుచ్చుకొనువారు
పుచ్చుకుంటినమ్మ వాయనం అని అనుకోవాలి
వాయనధాత్రి ప్రతిగృహేత్రికి అని నమస్కారము చేయలి ఆమెతో ఆశీర్వాదము తీసుకొనవలెను

శ్రీ మహాలక్ష్మీ కటాక్షసిద్ధికి శ్రీ వైభవలక్ష్మీ పూజా వ్రతకథ

పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలు నిర్మించుకొని లోకకల్యాణానికై తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ విద్యర్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. ఆ మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నుండి దండిగా సహాయ సహకారాలందిస్తూ పోషించెదివారు. అట్టి పవిత్ర తపోవనములలో పేరందినది నైమిశారణ్యము.

నైమిశారణ్యము ఉత్తరభారతంలో గోమతీ నదీతీరాన ఉండెను. అచట మహామునులంతా కలిసి లోకకల్యాణార్థము దీర్ఘసత్రయాగము నిర్వహించుచుండిరి. ఆ యాగములో పాల్గొనుటకు పలువురు మునులు సుదూర ప్రాంతముల నుండి యరుదెంచిరి. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశపురాణ పారీణుడగు వ్యాసమహర్షి శిష్యుడు సూతమహర్షి కూడయుండెను. ఆ సూతమహర్షిని చూడగనే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని సంతోషపడిరి. ఉదయకాలమున జపహోమపూజాదులతో ఆ తపోవనము దద్దరిల్లినది. మధ్యాహ్నకాలమున ఫలహారములు పూర్తియైన పిదప మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఓ మహానుభావా! నీవు సర్వజ్ఞుడవు. మీ గురుదేవుల అనుగ్రహం వలన నీవు వేదపురాణ ఇతిహాససారమంతా ఆపోశనం పట్టావు. మాకు కొన్ని సందేహాలుకలవు. ఆ సందేహములు తీర్చి మమ్ములను నిస్సందేహులుగా జేయగలందులకు ప్రార్థించుచున్నాము. ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములందురు గదా! వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభముగా పొందుటకు మార్గములున్నచో తెలుపగలందులకు ప్రార్థించుచున్నామని వేడుకొనిరి. వెంటనే సూతమహర్షి ఆ మునిమండలితో 'తపోధనులారా! మీరు మంచి ప్రశ్నవేసిరి. మీరడిగినది లోకమునకెంతయో ఉపయోగకరమైనది సావధానముగా వినుడ'ని ఇట్లు చెప్పనారంభించెను.

'మునులారా! పురుషార్థములో మొదటిది ధర్మము. మానవుడు ధర్మమార్గమున సంచరించుట ప్రథమకర్తవ్యము. ధర్మమనగా సర్వప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మము. ఆ ధర్మాచరణకు ముఖ్యసాధనభూతమైనదే రెండవ పురుషార్థమగు అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైనదైనచో బంగారమునకు పరిమళమబ్బినట్లే. కావున మానవుడు ధనార్జనకు ధర్మమార్గమవలంబించుట శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమై నిత్యసంతోషము నొసంగి ఆ వంశములోని వారికనంత సుఖానుభూతి నొసంగగలదు. కావున మానవుడు తాను సంపాదించిన ధనములో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగింపవలయును. అట్లుగాక సంపాదించిన ధనమునంతయు మానవుడు కుటుంబపోషణకు, సుఖానుభూతికి కూడబెట్టుటకు తలంచినచో దాని వలన కష్టములేగాని సుఖమే మాత్రము కలగదు. అందువలన మానవుడు సంపాదించిన ధనములో కొంతభాగము ధర్మకార్యములకై వెచ్చించినచో సుఖానుభూతిని పొందగలదు. దీనివలన మానవుడు నిత్యతృప్తుడై సుఖశాంతులతో శాశ్వతానందము పొందుట కవకాశము లభించును.' అని పల్కుచుండగా కొందరు మునులు సూతమహర్షితో స్వామీ! భగవంతుడు మానవులలో కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని దరిద్రులుగా సృజింపనేల? అందరినీ ఒకేవిధముగా సృజింపవచ్చునుగదా! ఈ పక్షపాత బుద్ధియేల? యని ప్రశ్నింప సూతమహర్షి ఇట్లనెను.

'ఓ మునులారా! భగవంతుని దృష్టిలో యేవిధమగు పక్షపాతములేదు. భగవంతుడందరినీ ఒకేవిధముగా సృష్టించును. కాని ఆయాప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధము ననుసరించి కష్టసుఖములు వారికి కల్గుచున్నవి. దీనికుదాహరణముగా సుశర్మోపాఖ్యానము వినిపింతును. శ్రద్ధగా వినుడ 'ని యీ విధముగా చెప్పనారంభించెను.

'అవంతీ దేశమున సుశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతడు చతుర్వేదములను షట్శాస్త్రములను క్షుణ్ణముగా నభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా  గెలుపొంది అపరసరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందెను. కాశ్మీర దేశమునుండి యరుదెంచిన పరాశరుడను పండితోత్తముడా సుశర్మకు తన కుమార్తెయగు శారదాదేవి నొసంగి వివాహముగావించెను. అవంతి దేశాధిపతి సుశర్మను గంగాతీరముననున్న గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించెను.

మహాపండితుడగు సుశర్మ గురుకులములోనున్న విద్యార్థులకు విద్యాబోధనచేయుచూ కాలము గడుపుచుండెను. దేశదేశములలో ఆ గురుకులమునకు మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించెను. క్రమక్రమముగా ఆ గురుకులములో విద్యపూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశములలో తమ ప్రతిభా పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానముల నంది అంతులేని ధనమునార్జించిరి.

పిదప కొంతకాలమునకు ఆ పండితులెల్లరూ తమ గురువగు సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలుపుటకై గురుకులమున కేతెంచి సుశర్మ పాదములపై బడి మీ అనుగ్రహమునే మేమింతవారమై అఖండ కీర్తి ప్రతిష్ఠలతో బాటు అపారధనము నార్జించితిమని చెప్పి అమూల్యవస్త్రాభరణములను, సువర్ణ నాణెములను గురుదేవులకు కానుకగా సమర్పించిరి. కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో మీ భక్తి ప్రపత్తులకు నేను చాల సంతోషించితిని. నాకీ సువర్ణనాణెములు గాని, అమూల్య వస్త్రాభరణములు గాని సంతోషము నీయజాలవు. వీనిని నేను ముట్టను నాకు సంపదల మీద యేవిధమగు ఆశలేదు. వీనిని మీరు తీసుకొనివెళ్ళి సుఖముగా నుండుడు. నా కీర్తి ప్రతిష్ఠలు నలువైపులా వ్యాపింపచేసిరి. అదియే నేను కోరుకొనుచుంటినని పల్కి ఆ సంపదలను తిరస్కరించెను. శిష్యులెన్ని విధముల బ్రతిమాలిననూ ఆ పండితోత్తముడా సంపదలను స్వీకరింపకపోవుటచే వారు గురువుల మనసు నొప్పింపలేక మిన్నకుండిరి. పిదపవారు గురువులకు తెలియకుండ గురుపత్ని యగు శారదాదేవికా కానుకలందించి తృప్తితో వెడలిపోయిరి.


శారదాదేవి శిష్యులొసంగిన అపారధన సంపదను భర్తకు తెలియకుండా దాచియుంచి వానినేవిధముగా బహిర్గతము చేయువలయునని యోచించుచు కాలము గడుపుచుండెను.

ఒకానొక దినమున ఏకాంతముననున్న సుశర్మ చెంతకు శారదాదేవి యేతెంచి నాథా! మిమ్ములనొకమాట అడుగవలెనని చాలారోజులనుండి తలంచుచుంటిని. అడుగమందురా? అని ప్రశ్నింపనాతడు నీ ప్రశ్నయేదో తెలుపమనెను. వెంటనే ఆమె నాథా! మీ శిష్యులు పలువురు దేశదేశములలో అఖండకీర్తి ప్రతిష్ఠలతోబాటు అపారధనసంపదలు సంపాదించుటకు కారణభూతులు మీరేకదా! అట్టిమీరు సర్వస్వము వదలి కూపస్థమండూకమువలె యీ గురుకులమునే నమ్ముకొని దినభత్యముతో కాలక్షేపము చేయుట భావ్యముగానున్నదా? మీకు ధనధాన్యములపై ఆశలేకపోవచ్చును. కాని నేను నా పిల్లలూ ధనహీనులుగా బ్రతుకుట దుర్భరముగానున్నది. మా కోరిక తీర్చుటకై మీరుకూడ దేశాటనము చేసి ప్రతిభాపాటవములను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణిమాణిక్యములను అగ్రహారములను సంపాదించాడు, లేనియెడల మేమీ మనోవేదనతో కొంతకాలమున కసువులు బాసెద'మని నిష్కర్షగా చెప్పెను. అంతట ఆ మహాపండితుడామెతో ఓ శారదా! ధనము శాశ్వతము కాదు. దాని వలన సుఖమును పొందలేము. దుఃఖమును కల్గించును. మనమింత కాలము ఎంతోసుఖముగా జీవించితిమిగదా! నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనము చూచిన నాటినుంచి నీక్ దుఃఖము ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగమునకే సిద్ధమైతివి. కావున నీవు ఎప్పటివలె ప్రాప్తలాభముతో సుఖముగా జీవించుము. కోరికలు వదులుమని నచ్చచెప్పెను. ఎన్నిచెప్పినను ఆమె ఎంతమాత్రము ధనసంపదలు లేకుండ జీవించి యుండజాలనని బదులుపల్కెను. వెంటనే సుశర్మ ఆమెతో ఓ సాధ్వీ!  నీవు తొందరపడవలదు. నేను నా పాండిత్యమును ప్రదర్శించి రాజాధిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరుటకు ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షము కురిపింపచేయగలనని ఆమెను శాంతింపచేసెను. ఒక శుభదినమున శ్రీమహాలక్ష్మీదేవి యనుగ్రహమును బడయుటకై మహాలక్ష్మీయాగము ప్రారంభించెను. నలుబది దినములు అహోరాత్రములు జపహోమార్చనలతో ఆ మహాలక్ష్మిని గూర్చి తపముచేసెను. నలుబదియెకటవ దినమున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్థరాత్రమున మనయింట కనకవర్షము పడునని భార్యకు తెలిపెను. ఆ శారదాదేవి ఎంతో సంతోషముతో అర్థరాత్రికై ఎదురుజూచెను. అర్థరాత్రియైనది కాని ఆ యింట కనక వర్షము కాదుకదా కనీసము నీటితుంపరలైననూ జాలువారలేదు. క్రమముగా తెల్లవారజొచ్చెను. అప్పుడు శారదాదేవి సుఖనిద్రనుండి మేల్కొన్న సుశర్మ చెంతకు చేరి నాథా! మీ మాటలు నీటిమూటలయ్యెను. కనకవర్షము కాదుగదా కనీసము నీటితుంపరలు కూడా పడలేదు. రాత్రియంతయు సుఖనిద్రమాని రెప్పపాటుకూడా వేయక ఎదురుచూచితిని. నా ఆశలు అడియాశలైనవి. నేనెంతయో దురదృష్టవంతురాలను. మీవంటి బూటకములాడు భర్తను కట్టుకొని నేను మోసపోతిని. మీ కండ్లయెదుటనే నేను ప్రాణత్యాగము చెయుదు" నని పలుక నాపండితోత్తముడు తన భార్యతో ఓ శారదా! నేను మహాలక్ష్మీదేవినుద్ధేశించి భక్తిశ్రద్ధలతో అఖండ తపమొనరించితిని. ఆమెకు నాపై కరుణ కల్గలేదు. అసత్యవాదిగా నాకు పేరుతెచ్చిన ఆ మహాలక్ష్మీనే నా కండ్ల ఎదుట అభిచారహోమముచేసి బూడిదపాలు గావించెదనని" ఘోరశపధము గావించి ఉదయకాలమున అభిచార హోమమునకు సంసిద్ధుడయ్యెను. సుశర్మ నల్లని వస్త్రములు ధరించి రౌద్రరూపముతో అభిచార హోమమున కుపక్రమించెను. వేపసమిధలు అగ్నిలోవ్రేల్చ నారంభించెను. అగ్నిదేవునిలో రౌద్రరూపము చేర్పడినట్టుల నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. ఆ సమయమున సుశర్మ తాటియాకుపై ఘంటముతో తానింతకాలము తపముచేసిన మహాలక్ష్మీ మంత్రమును బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠగావించి దానిని అగ్నిగుండములో హోమము చేయుటకు సంసిద్ధుడగుచుండగా దూరమునుండి 'ఓ సుశర్మా నీవు హోమము ఆపుము ఆపుమనీ యొక స్త్రీ ఆర్తనాదము కర్ణకఠోరముగా వినిపించెను. వెంటనే సుశర్మ హోమము ఆపి ఆ ఆర్తనాదము వినబడ్డదిక్కుకు చూడగా యొకస్త్రీ జుట్టు విరబోసుకుని మలిన వస్త్రములతో కాంతివిహీనమైన దేహసౌందర్యముతో ఎదురువచ్చి హోమమాపుమని కోరెను. వెంటనే సుశర్మ అమ్మా నీవెవరివు? ఎందులకు నా హోమమాపుజేయవలెనని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ సుశర్మా నీవెవరి కొరకై నలుబది దినములు అఖండ తపశ్చర్య జరిపితివో యా మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనకవర్షము కురిపింప ప్రయత్నింపగా నా అక్కయగు ఉనిగానే జ్యేష్టాదేవి(దరిద్ర దేవత) నాతో నీవా సుశర్మకు అపారధనరాసులొసంగుటకు వీలులేదు. అతడు పూర్వము ఏడుజన్మలలోను ఎవ్వరికీ ఏమి దానమిచ్చియుండలేదు. ఎవరికీ ఏమియు పెట్టలేదు. ఆ ప్రారబ్ధదోషమువలన యీ జన్మలో దరిద్రునిగానే యుండవలెను. ఈ తపఃఫలమువలన అతదు మరుజన్మలో రాజసంపదలనుభవించునని యడ్డగించెను. నేనామె మాటలను త్రోసిపుచ్చి నీయింట కనకవర్షము కురిపించుటకు పూనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీవిధముగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగినది తెలియక క్రోధముతో అభిచారహోమముసల్పిన మరింత ప్రారబ్ధమును మూటకట్టుకుందువని హోమమునాపు జేయమంటిని' అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడామెతో నేను జీవించియుండగనే నా దారా పుత్రుల కోరికదీర్చవలయునని తలంచితిని. నేను సన్యాసాశ్రమమును స్వీకరించి ఈ జన్మను కడతేర్తును. నా భార్యాపుత్రుల కోరిక తీరునుగదా! యని పలుకగా తప్పక తీరునని జెప్పెను. వెంటనే సుశర్మ తన భార్యతో శారదా! వింటివిగదా నీవు. నేను కావలయునా? లేక ధనసంపదలు కావలయునా? అని ప్రశ్నింపనామె వెంటనే స్వామీ! మీరు సన్యాసము స్వీకరించి మమ్ములను సుఖముగా బ్రతుకనీయుడు అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడు విధివిధానముగా సన్యాసాశ్రమమును స్వీకరించి శిఖాయజ్ఞోపవీతములను విసర్జించి దంకమండలములు స్వీకరించి గ్రామైకరాత్రముగా దేశాటన కుద్యుక్తుడయ్యెను. శారదాదేవి ఇంట కనకవర్షము కురిసెను. ఆ తల్లీపిల్లలెంతో ఆనందమందిరి. ఎదుటనున్న మహాలక్ష్మి ఎప్పటివలె వెలుగొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి యెదుట నిలిచి 'ఓ పరివ్రాజక! నీవలన నేను కొత్త అవతారమునెత్తితిని, మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా యవతరించితిని. నన్ను కొలిచినవారికి, నా పూజలు చేసినవారికి ప్రారబ్ధదోషములు రూపుమాపి ఆ జన్మలోనే అష్టైశ్వర్యములు నొసంగగలను. నీవు సన్యాసివైననూ నీవు యీ దేశాధినాధుడవై సంపదలలో మునిగియున్ననూ తామరాకు మీద నీటి బొట్టువలె సంచరించి లోకోపకారము గావింతువు' అని పల్కి అదృశ్యమయ్యెను.

మహర్షులారా! కాబట్టి మానవుడుగాని యే ప్రాణిగాని తాము పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధముననుసరించి సుఖఃదుఖములను ధనదారిద్ర్యములను అనుభవించెదరు. అష్టలక్ష్మీ అవతారములకంటె వైభవలక్ష్మీ అవతారము సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధదోషాన్ని కూడా రూపుమాపి అఖండ అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మీ అవతారము. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరుటకు ఈ వ్రతాన్ని ఆరంభించినవారు ఎనిమిది శుక్రవారములు సాయంకాలము ప్రదోషకాలములో బంధువులను మిత్రులను ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి సమక్షములో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదములు పంచి లక్ష్మీస్తోత్రము మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచవలెను. ఈ విధముగా ఎనిమిది శుక్రవారములు వైభవలక్ష్మీ వ్రతం చేసి చివరి వారమున ఎనిమిదిమంది ముత్తైదువులను పిలచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలములతో 8 వైభవలక్ష్మీ వ్రతకథా ప్రతులను వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలెను. ఇదియే ఈ వ్రతమునకు ఉద్యాపనము. ఈ వ్రతము ఆచరించిన వారికి అష్టైశ్వర్యములతో బాటు అఖండ సౌభాగ్యము కలుగును అని సూతమహర్షి మహామునులకు వినిపించెను.