Wednesday, September 24, 2025

దుర్గా సప్తశతీ పారాయణం

దుర్గా సప్తశతీ పారాయణక్రమః 

దేవీ మహత్య్మం

గణపతి ధ్యానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

ఓం గణానాం త్వా గణపతిగ్ఒ హవామహే
కవిం కవీనాముపమశ్రవస్రమం |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, బ్రహ్మణస్పత 
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనం ||

శ్రీమహాగణాధిపతయే నమః

    

దేవీ కవచం

 
అర్గలా స్తోత్రం 


కీలక స్తోత్రం 
 

 

దుర్గా సప్తశతి పారాయణ విధి:

దసరా అంటే పది పాపాలను హరిస్తుంది అని అర్థం. ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి హస్తా నక్షత్రంలో వచ్చే శుభదినమున దేవి పూజ చేస్తే మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. మొదటి మూడు రోజులు దుర్గా దేవి రూపాన్ని తరువాతి మూడు రోజులు లక్ష్మి రూపాన్ని చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని పూజిస్తారు.

దసరా నవరాత్రుల సమయంలో దుర్గా సప్తశతి పారాయణం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా దీనిని పారాయణం చేయవచ్చు, శుభఫలితాలను పొందవచ్చు. 

దుర్గా సప్తశతిని పారాయణం చేయడానికి మూడు రకాల విధానాలు ఉన్నాయి. మీకు ఏది సరిపోతుందో చూసుకుని దానిని పాటించాలి. దుర్గా సప్తశతిని 'దేవి మహాత్మ్యం' అని కూడా అంటారు. ఇందులో సుమారు 700 శ్లోకాలు ఉంటాయి. దీనిని 'చండీ పఠ' అని కూడా పిలుస్తారు. ఇందులో 13 అధ్యాయాలు కలిగి ఉన్నాయి.

మొదటి విధానం: 
నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అత్యంత పుణ్యప్రదమైనవి పారాయణం చేయడం, నామ జపం, ఉపవాసం, అర్చన దేవీ స్తొత్రం ఇల యేది కుదిరితె అది వారి వీలును బట్టి ఆచరించి అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. మొదటి రోజు నుండి 13 అధ్యాయాలు చదవాలి. అయితే దీనికి భక్తి, శ్రద్ధ ఒపిక కావలి. ఇది మొదటి విధానం. 

రెండో విధానం:
పాడ్యమి రోజు మొదటి అధ్యాయం మాత్రమే పారాయణం చేయాలి. రెందో రోజు 2,3,4 అధ్యాయాలు పారాయణం చేయాలి. మూడవ రోజు మిగిలిన అధ్యాయాలు పూర్తి చేయాలి. ఇలా మూడు రోజులలో వరుసగ పూర్తి చేయాలి. మొదటి మూడు రోజులు ఇబ్బంది అయితే మధ్యలో ఆపకుండా చివరి మూడు రోజులు అనగా దుర్గాష్టమి రోజు మొదలు పెట్టి మహర్నవమి, విజయదశమి రోజు పారాయణ పూర్తి చేయాలి.

మూడో విధానం:

మొదటి రోజు : 1వ అధ్యాయం 
రెండో రోజు : 2,3 అధ్యాయాలు 
మూడో రోజు : 4వ అధ్యాయం 
నాలుగో రోజు : 5,6 అధ్యాయాలు
అయిదో రోజు : 7వ అధ్యాయం 
ఆరో రోజు : 8వ అధ్యాయం
ఏడో రోజు : 9,10 అధ్యాయాలు
ఎనిమిదో రోజు : 11వ అధ్యాయం 
తొమ్మిదో రోజు :  12వ అధ్యాయం
విజయదశమి రోజు 13వ అధ్యాయం పారాయణ చేసి పది రోజులలో పూర్తి చేయాలి. 
 


మొదటి రోజు :

దుర్గా సప్తశతి ప్రథమోఽధ్యాయః


రెండో రోజు :
దుర్గా సప్తశతి ద్వితీయోఽధ్యాయః
దుర్గా సప్తశతి తృతీయోఽధ్యాయః
దుర్గా సప్తశతి చతుర్థోఽధ్యాయః


మూడో రోజు :
దుర్గా సప్తశతి పంచమోఽధ్యాయః
దుర్గా సప్తశతి షష్ఠోఽధ్యాయః

నాలుగో రోజు :
దుర్గా సప్తశతి సప్తమోఽధ్యాయః
 

అయిదో రోజు : 
దుర్గా సప్తశతి అష్టమోఽధ్యాయః
 

ఆరో రోజు :
దుర్గా సప్తశతి నవమోఽధ్యాయః
దుర్గా సప్తశతి దశమోఽధ్యాయః

 

ఏడో రోజు : 
దుర్గా సప్తశతి ఏకాదశోఽధ్యాయః
 

ఎనిమిదో రోజు :  
దుర్గా సప్తశతి ద్వాదశోఽధ్యాయః


తొమ్మిదో రోజు :  
దుర్గా సప్తశతి త్రయోదశోఽధ్యాయః 


సిద్ధ కుంజికా స్తోత్రం

అపరాధ క్షమాపణా స్తోత్రం 

 

 

 

 


No comments:

Post a Comment