ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్ధం , శ్రీ పార్వతీ ప్రసాద సిత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే దక్షిణానే , శరద్ రుతౌ , ఆశ్వీయుజ మాసే , శుక్ల పక్షే (ఈరోజు తిథి) తిథౌ శుభ వాసరే శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాం సర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
( తొమ్మిది రోజులు పూజ సంకల్పం చెప్పుకోవాలి)
ఆయుధ పూజ:
పూర్వము పాండవులు శమీ వృక్షముపైన తమ ఆయుధములను దాచి, అఘ్నాతవాసము చేసినారు. అర్జునుడు శమీవృక్షముపై తన గాండీవమును దింపి కౌరవులతో యుద్ధము చేయుటతో వారి అఘ్నాతవాసము ముగిసినది. అందువలన ఈరోజున ఆయుధములకు, వాహనములకు లేదా తాము ఉపయోగించు యంత్రములకు పూజ చేయవలెను. కనుక ఈ రోజున శమీ వృక్షానికి ఒక విశిష్టత ఏర్పడినది. ఈ రోజున సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం(జమ్మిచెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి, ఈ క్రింద శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి.
శ్లో. శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
తొమ్మిది రోజులు దేవిని తొమ్మిది రకాలుగా అలంకరించి పూజించాలి.
3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి
4వ రోజు శ్రీ కాత్యాయని దేవి
5వ రోజు శ్రీ లక్ష్మిదేవి
6వ రోజు శ్రీ లలితాదేవి
ధ్యానం:
లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామీశ్వరీం
ధాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాంత్వా
త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
శ్రీ.............నమః ధ్యానం సమర్పయామి
ఆవాహనం: (దేవి పాదాల పై అక్షతలు చల్లవలెను)
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాంచంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మమావహ
సహస్రదళ పద్మాస్యాం స్వస్థాంచ సుమనోహరాం
శాంతాంచ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూం
శ్రీ.........నమః ఆవాహయామి
ఆసనం: (పుష్పముతో నీటిని చల్లవలేను)
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోదినీం
శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మాదేవీజుషతాం
శ్రీ........నమః పదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం:(పుష్పముతో నీటిని చల్లవలేను)
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామాద్ర్రాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తా మిహోపహ్వాయే శ్రియం
శ్రీ........నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం: (పుష్పముతో నీటిని చల్లవలెను)
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీమీగంశరణమహం
ప్రపద్యే లక్ష్మీర్యేనశ్యతాం త్వాం వృణే
శ్రీ........నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
శుద్దోదకస్నానం: (కొబ్బరినీళ్ళు చల్లవలేను)
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవవృక్షోథబిల్వః
తస్యఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చబాహ్య లక్ష్మిః
శ్రీ........నమః శుద్దోదకస్నానం సమర్పయామి
స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి
వస్త్రం: (పత్తితో చేసిన వస్త్రయుగ్మం ఉంచవలేను)
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్బూతోస్మిరాష్ట్రేస్మింకీర్తిమృద్ధిం దదాతుమే
శ్రీ............నమః వస్త్రయుగ్మం సమర్పయామి
గంధం: (గంధం చల్లవలెను)
గంధద్వారాం దురధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ సర్వభూతానాం తామిహోపహ్వాయేశ్రియం
శ్రీ..........నమః గంధం ధారయామి
ఆభరణాని: (పుష్పములు అక్షతలు ఉంచవలెను)
రత్న స్వర్ణప్రకాశంచ దేహాలంకార వర్ధనం
శొభాదానం శ్రీకరంచ భూషణం ప్రతి గృహ్యతాం
శ్రీ......నమః సర్వాభరణాని సమర్పయామి
పుషాణి: (పుష్పాలు పసుపు, కుంకుమలతో పూజ చేయవలెను)
కర్దమేన ప్రజాభూతా మయీసంభవ కర్దమ
శ్రియంవాసయ మే కులే మారతం పద్మమాలినీం
శ్రీ...........నమః నానావిధపత్ర్పుష్పాణి సమర్పయామి
అష్టోత్తరం: (ఏ దేవిని పూజిస్తారో ఆ దేవి అష్టోత్తరం చదవవలెను)
ధూపం: (అగరవత్తులు ధూపం వేయవలెను)
దశాంగ గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపందాస్యామితేదేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం
శ్రీ............నమః ధూపమాఘ్రపయామి
దీపం: (దీపమునకు నమస్కరించవలెను)ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకారవినాసకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితాభవ
శ్రీ............నమః దీపం దర్శయామి
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
నైవేద్యం: (నైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై నీటిని చల్లవలెను)
ఆద్ర్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి
5సార్లు నైవేద్యం చూపవలెను
ఓం ప్రాణాయస్వాహా
ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి - అమృతాపి ధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
శుద్దచమనీయం సమర్పయామి
శ్రీ.........నైవేద్యం సమర్పయామి
తాంబూలం: (తాంబూలం దేవి వద్ద ఉంచవలెను)
ఉగిఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ..........నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం: (కర్పూరం వెలిగించి దేవికి చూపవలెను)
నీరాజనం సమానీతం కర్పూరేణీ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థ్యం ప్రతిగృహ్యతాం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
శ్రీ........నమః ఆనంద కర్పూర నీరజనం దర్శయామి
నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
మంత్రపుష్పం: (అక్షతలు, పుష్పం దేవి వద్ద ఉంచవలెను)
పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణీప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
శ్రీ...........నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ: (3 సార్లు ప్రదక్షిణ చేయాలి)
యానికానీచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీ...........నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం సదాస్తుతే
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
సుప్రీతో సుప్రసన్నా వరదా భవంతు
సర్వం శ్రీ........దేవతార్పణమస్తు
No comments:
Post a Comment